అక్టోబర్ 5వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. అక్టోబర్ 6వ తేదిన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్ఫణ… అక్టోబర్ 7 నుండి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
అయితే అక్టోబర్ 7వ తేదిన సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య ధ్వజారోహణంతో ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలు… 7వ తేది రాత్రి 8.30 నుండి 9.30 గంటల మధ్య పెద్దశేష వాహనం మీద దర్శనమివ్వనున్నారు. ఇక 8వ తేది ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం….రాత్రి 7 గంటలకు హంస వాహనం… 9వ తేది ఉదయం 9 గంటలకు సింహ వాహనం …రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం… 10వ తేది ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనం….రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం… 11వ తేది ఉదయం 9 గంటలకు మోహిని అవతారం ….రాత్రి 7 గంటలకు గరుడ వాహనం… 12వ తేది ఉదయం 9 గంటలకు హనుమంత వాహనం…సాయంత్రం 4 గంటలకు సర్వభూపాల వాహనం…రాత్రి 7 గంటలకు గజ వాహనం… 13వ తేది ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనం ….రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం… 14వ తేది ఉదయం 7.35 గంటలకు సర్వభూపాల వాహనం…రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం మీద భక్తులకు స్వామివారు దర్శనమిస్తారు. ఇక 15వ తేది ఉదయం 6 గంటలకు పల్లకి సేవ….8 గంటలకు చక్రస్నానం రాత్రి 8 గంటలకు ధ్వజాఅవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.