NTV Telugu Site icon

Tirumala Laddu controversy: తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి..! ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌..

Laddu

Laddu

Tirumala Laddu controversy: తిరుమల లడ్డులో కల్తీ నెయ్యుని వినియోగించారని.. గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ బోర్డు ఆమోదించిన టెండర్ వల్ల కల్తీ నెయ్యి వినియోగం జరిగిందనే విషయాన్ని ఈవో శ్యామల రావు నిర్ధారించారు. జాతీయ స్థాయిలో పేరొందిన NDDB ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. దీనిపై రాజకీయంగా దుమారం రేగుతోంది. అధికార టీడీపీ.. మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ అపచారం నువ్వు చేశావంటే నువ్వు చేశావని దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ రాజకీయాలు పక్కన పెడితే వెంకన్న భక్తుల మనోభావాలు.. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా.. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయీంశంగా మారింది. కల్తీ నెయ్యిని పక్కన పెట్టేసి.. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లడ్డుల తయారీ చేస్తున్నామని ఈవో స్పష్టం చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. జరిగిన అపచారం సంగతేంటనే దాని పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీని పైనే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భక్తుల మనోభానాలను.. ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం సీరియస్సుగానే ఆలోచిస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు.

Read Also: Gun Fire: కోర్టులోనే జడ్జిని కాల్చి చంపిన పోలీస్ ఇన్‭స్పెక్టర్..

ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు ఏం చేయాలనే దానిపై ఆగమ పండితుల నుంచి సలహాలు స్వీకరించనుంది ప్రభుత్వం. అలాగే మఠాధిపతులు.. పీఠాధిపతులతో చర్చించి శుద్ధి కార్యక్రమం జరపాలా..? లేక సంప్రోక్షణ చేయాలా..? లేక ఆగమ శాస్త్రంలో మరే విధానమేదైనా ఉందా అనే కోణంలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో ఆధ్యాత్మిక వేత్తలతో.. పీఠాధిపతులతో.. మఠాధిపతులతో సీఎం చంద్రబాబు సహా టీటీడీ ఉన్నతాధికారులు, చర్చించే సూచనలు కన్రిస్తున్నాయి. ఆధ్యాత్మిక గురువులతో సలహాలు.. సంప్రదింపులు జరిపిన మీదట తుది నిర్ణయానికు వచ్చే అవకాశం కన్పిస్తోంది. సంప్రోక్షణా..? శుద్దా అనే అంశం పైనా లేక వేరే విధానామా..? అనే అంశంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందువులు.. హిందూ సంఘాలు వివిధ రాష్ట్రాల్లో ఆందోళన చేపడుతోన్న పరిస్థితి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై సీరియస్సుగా ఉంది. ఇప్పటికే జేపీ నడ్డా సీఎం చంద్రబాబుతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. రాహుల్ గాంధీ లడ్డూ విషయమై స్పందించారు. దీంతో భక్తుల మనోభావాలకు దెబ్బ కలగకుండా.. తిరుమల పవిత్రతని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరితగతినే ఓ నిర్ణయానికి రానుంది ఏపీ ప్రభుత్వం.

Read Also: Sankashti Chaturthi: సంకష్టహరచతుర్థి నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మనోభీష్టాలు నెరవేరుతాయి

మరోవైపు ఈ అపచారానికి పాల్పడిన వారిని శిక్షించాలని.. ఈ వ్యవహరంపై కేసు నమోదు చేసి విచారణ జరపాలన్న డిమాండ్లూ పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీంతో ఈ అపచారానికి పాల్పడి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారు ఎవరు..? ఎవరిపై కేసులు నమోదు చేయాలి..? దీనికి బాధ్యులు ఎవరనే అంశాన్ని నిగ్గు తేల్చనున్నారు. ఇంతటి ఘోర అపచారం జరిగిన తర్వాత కూడా సంబంధిత వ్యక్తులపై చర్యలు లేకుండా వదివేస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అంతే కాకుండా ప్రభుత్వమే రాజకీయం చేసిందని అప్రతిష్టని మూట గట్టుకోవాల్సి వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బాధ్యులపై కేసులు నమోదు చేయడమే కాకుండా శిక్ష పడే విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. గత ఐదేళ్ల కాలంలో తిరుమల కొండ మీద అపచారాలు జరిగాయని చాలా సార్లు విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు గత ప్రభుత్వం గురించి తిరుమల లడ్డూ విషయంలో తీవ్రమైన అపచార చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.