NTV Telugu Site icon

Vaikunta Dwara Darshan 2025: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ ఫోకస్‌.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

Ttd

Ttd

Vaikunta Dwara Darshan 2025: వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే చాలు.. వైష్ణవాలయాలలో ప్రత్యేకంగా ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు.. ఇక, ఈ సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు.. విష్ణుమూర్తిని వైకుంఠ ద్వారా దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తరద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటారు భక్తులు.. అయితే, 2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజులపాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. పది రోజులపాటు టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించునుంది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనంపై అధికారులతో సమీక్షించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి..

Read Also: Amaravati: స్పీడందుకున్న రాజధాని అమరావతి పనులు..

వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ, పాలు, కాఫీ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి.. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపిన ఆయన.. కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులకు తిరుమలకు అనుమతిస్తారన్నారు.. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా పది రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ, మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు చేయబడ్డాయి.. గోవింద మాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారని పేర్కొన్నారు..

Read Also: Haish Rao: సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారు..

ఇక, వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు చేసినట్టు తెలిపారు టీటీడీ అదనపు ఈవో.. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రంలో అన్ని కౌంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రతి రోజూ 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుకుని అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ గా ఉంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.. పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రతా ఏర్పాట్లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.. చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీరు అందుబాటులో ఉండేలా చూడాలి.. విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.. భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగు నీరు, టీ, కాఫీ, పాలు, స్నాక్స్ పంపిణీ చేయాలి.. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ లు ఏర్పాటు. పార్కింగ్ వద్ద నుండి క్యూలైన్ వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు ఉంటుందన్నారు. తిరుమలలో శోభాయమానంగా విద్యుద్దీపాలు, పుష్పాల అలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. మూడు వేల మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్స్ & గైడ్స్ సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవాలని కీలక సూచనలు చేశారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి..

Show comments