Site icon NTV Telugu

Tirumala: మెట్ల మార్గంలో 100 ట్రాప్ కెమెరాలు.. భక్తులకు నో టెన్షన్‌.. !

Trap Cameras

Trap Cameras

Tirumala: శేషాచలం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎర్రచందనం. అయితే, అంతేస్థాయిలో అక్కడ వన్య ప్రాణులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిరుతపులుల సంచారం ఎక్కువైంది. ఏనుగులు, ఇతర వైల్డ్ లైఫ్‌ కూడా చాలానే ఉంది. వాటిబారి నుంచి మనుషులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే అటవీశాఖ టెక్నాలజీ పరంగా కొన్ని విప్లవాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా అటవీప్రాంతాల్లో వన్యప్రాణుల పర్యవేక్షణకు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, తిరుమలలో నిరంతరం చిరుతపులులు సంచరిస్తున్నాయి. అందుకే.. అవి ఎన్ని ఉన్నాయి… ఎక్కడెడక్కడ తిరుగుతుంటాయి అనే విషయాలపై ఫారెస్ట్ డిపార్టుమెంట్ దృష్టి పెట్టింది. వాటితో పాటు ఇతర జంతువుల సంచారాన్ని అంచనా వేసేలా చర్యలు తీసుకుంది.

Read Also: KCR: ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం.. విజ్ఞాలు తొలగాలని పూజలు

అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మెట్లమార్గంలో 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇందులో 30కిపైగా సోలార్ పవర్ లైవ్ స్ట్రీమింగ్ కెమెరాలున్నాయి. వాటితో పాటు AI ఆధారిత పర్యవేక్షణ, ప్రిడిక్టివ్ అనాలిసిస్.. డ్రోన్ నిఘా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక, ఏర్పాటు చేసిన టెక్నాలజీ సత్ఫలితాలిస్తోంది. శేషచల అటవీప్రాంతం లోపల అటవీశాఖ చిరుత పులుల సంచారాన్ని గుర్తించింది. కెమెరాలలో ఎనుగులు గుంపు దృశ్యాలు రికార్డయ్యాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య డివిజన్లలో డే అండ్ నైట్ పర్యవేక్షణ, డ్రోన్లు, GPS, గూగుల్ మ్యాపింగ్ ద్వారా ఏనుగుల కదలికల అంచనా వేస్తున్నారు. ఏనుగు దాడులను అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో స్మార్ట్ ఫెన్సింగ్, SMS హెచ్చరికలు పంపేలా చర్యలు చేపట్టారు. 24 గంటల పర్యవేక్షణ సెల్ బయోలాబ్ ద్వారా ఏనుగుల డేటా సేకరిస్తున్నారు. కమ్యూనికేషన్.. హెచ్చరికలు.. వాట్సాప్, లౌడ్‌స్పీకర్ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. తాజా లెక్కలు ప్రకారం తిరుపతి డివిజన్‌లో 40కిపైగా ఏనుగులు ఉన్నట్లుగా గుర్తించారు. ట్రాప్ కెమెరాలో చిరుతపులి వీడియోలు రికార్డయ్యాయి. డ్రోన్ కెమెరా, ట్రాప్ కెమెరాల్లోనూ ఏనుగులు సంచరిస్తున్న దృశ్యాలు కనిపించాయి.

Exit mobile version