NTV Telugu Site icon

Vaikunta Dwara Darshan 2025: వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష.. భక్తులకు కీలక సూచనలు

Ttd Eo Syamalarao

Ttd Eo Syamalarao

Vaikunta Dwara Darshan 2025: ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు ఈవో శ్యామలరావు. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 10వ తేదీ ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు దర్శనం ప్రారంభమవుతుందన్నారు.. ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభిస్తామన్నారు ఈవో.. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం ఊరేగింపు నిర్వహిస్తామని.. అటు తరువాత ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో ఉత్సవమూర్తులు భక్తులుకు దర్శనం ఇస్తారన్నారు. 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం భక్తులకు మూడు రోజులకు సంభందించిన లక్షా 20 వేల టోకేన్లు జారీ చేస్తామని వెల్లడించారు. దర్శన టోకెన్లు కలిగిన భక్తులు కేటాయించిన సమయానికే క్యూ లైన్‌ వద్దకు చేరుకోవాలని సూచించారు.

Read Also: Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ..

మొత్తంగా 10 రోజుల వ్యవధిలో 7 లక్షల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు టీటీడీ ఈవో శ్వామలరావు.. ఇప్పటికే లక్షా 40 వేల టోకేన్లు ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు ఆన్ లైన్ విధానంలో కేటాయించామని.. ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు 4.32 లక్షల టోకెన్లు జారీ చేస్తామన్నారు. జనవరి 9వ తేదీన దర్శనానికి సంబంధించి సర్వదర్శనం భక్తులకు టోకెన్లు జారీ వుండదని స్పష్టం చేశారు.. శ్రీవారి మెట్టు నడకదారిలో 10 రోజులు పాటు టోకెన్లు జారీ వుండదన్నారు. 10 రోజులు పాటు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తామని.. భక్తుల సౌకర్యార్థం 12 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసామన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో శ్యామలరావు..

Show comments