Tirumala: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని.. ఆ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.. చిన్న విషయానికి కూడా కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి.. ఆనందం పొందుతుందని మండిపడ్డారు.. అయితే, తాజాగా, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై కేసు నమోదు అయ్యింది.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత శ్రీవారి ఆలయం ముందు రాజకీయ వాఖ్యలు చేశారని రవీంద్రనాథ్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీటీ విజిలెన్స్ అధికారులు. ఇక, విజిలెన్స్ ఫర్యాదుతో రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు.
Read Also: Tollywood Bund : ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ
కాగా, ఆదివారం రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత పల్లె రవీంద్రనాథ్ రెడ్డి.. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ జగన్ వెంటే ఉన్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. అసలు జగన్ తలచుకుంటే.. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ నామినేషన్ కూడా వేసేవాళ్లు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి సర్కార్ అరాచకాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.. ప్రజలను, వైసీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యనించిన విషయం విదితమే..
