NTV Telugu Site icon

Tirumala: రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల..

Ratha Sapthami

Ratha Sapthami

రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతుంది. ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొనే రథసప్తమి పర్వదినం రోజున స్వామివారు సప్త వాహనాలపై మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం ఐదున్నర గంటలకు సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతాయి. 9 గంటలకు చిన్నశేష వాహనంపై మాఢవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. 11 గంటలకు గరుడ వాహన సేవ, ఒంటిగంటకు హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, 6 గంటలకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ముగియనున్నాయి.

Read Also: Cricket Betting: విశాఖ క్రికెట్ బెట్టింగ్ ముఠా కేసులో సంచలన విషయాలు..

రథసప్తమి వేడుకలకు 2 లక్షల మంది భక్తులు ప్రత్యేక్షంగా స్వామివారి వాహన సేవలను వీక్షించే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా.. రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై అధికారులతో ఈఓ శ్యామలరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రథసప్తమి వేడుకలను ప్రత్యేక్షంగా విక్షీంచేందుకు 2 లక్షల భక్తులు విచ్చేస్తారని అంచనా వేశారు. ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా సిఫార్సు లేఖలు స్వీకరణ, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. అలాగే.. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ కూడా నిలిపివేశారు. మరోవైపు.. గ్యాలరీలో వేచివున్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యం కల్పిస్తామని టీటీడీ పేర్కొంది.

Read Also: IRCTC: ట్రైన్ టికెట్ కు డబ్బులు లేకపోయినా.. జీరో పేమెంట్‌తో ఇలా బుక్ చేసుకోవచ్చు!