TTD Alert: తిరుమల భక్తులకు అలర్ట్.. అంతవరకు సిఫార్సు లేఖల దర్శనం బంద్..!
- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం
- ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంతకాలం సిఫార్సు లేఖలు స్వీకరించబోమని ప్రకటన
- శ్రీవారి దర్శనం, తిరుమల వసతి కోసం సిఫార్సు లేఖలకు అనుమతి లేదు
- ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రం నిబంధనల ప్రకారం మినహాయింపు
- ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వస్తే దర్శనం, వసతి సౌకర్యాలు
- వారి తరఫున ఇతరులు తీసుకొచ్చే సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టత...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Alert: రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంతకాలం శ్రీవారి దర్శనం, వసతి కోసం ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ అధికారిక ప్రకటన ప్రకారం.. శ్రీవారి దర్శనం, తిరుమలలో వసతి కోసం ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల సిఫార్సు లేఖలకు ఇకపై అనుమతి ఉండదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంతకాలం ఈ నిబంధన కొనసాగుతుందని తెలిపింది.
అయితే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా తిరుమలకు వస్తే నిబంధనల ప్రకారం వారికి దర్శనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ వెల్లడించింది. వారి తరఫున ఇతరులు తీసుకొచ్చే సిఫార్సు లేఖలను మాత్రం స్వీకరించబోమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి, సిఫార్సు లేఖలతో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా తమ పర్యటనను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది.
Also Read
- Tirumala: అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
భక్తులకు ముఖ్య గమనిక!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున శ్రీవారి దర్శనం, వసతి కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించగలరు.
#TTD #Tirumala #SrivariDarshan #TTDOfficialUpdates #TirumalaTirupatiDevasthanams https://t.co/ZAmSVoSgYK
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) October 21, 2026
తాజావార్తలు
-
TTD Alert: తిరుమల భక్తులకు అలర్ట్.. అంతవరకు సిఫార్సు లేఖల దర్శనం బంద్..!
-
The Traitors Telugu :’చీప్.. మిడిల్ క్లాస్’.. వర్ష’పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
-
BJP: తిరుగుబాటు కోసమే వియత్నాంకు రాహుల్ గాంధీ.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ.!
-
Killer Movie: ఇంటర్వెల్ ట్విస్ట్ చెబితే ఏకంగా కోటి రూపాయలు: డైరెక్టర్ సంచలన ఛాలెంజ్
-
BJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ‘‘జెన్-జీ’’ కాదు.. తిరంగాతో సానుభూతి యత్నం!
ట్రెండింగ్
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!