NTV Telugu Site icon

Tirupati Laddu Controversy: లడ్డూ ప్రసాదం కల్తీపై విచారణ.. నేడు తిరుపతికి సిట్‌ బృందం..

Sit

Sit

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్.. రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరుపనుంది. దీంతో.. ఎవరిని ప్రశ్నిస్తారు.. ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు.. పక్క రాష్ట్రాలనుంచీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో.. చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కలిసి సిట్‌ ఏర్పాటు చేసింది.

Read Also: Hydra Commissioner: కూకట్‌పల్లి లో చనిపోయిన మహిళకు.. హైడ్రా తో ఎలాంటి సంబంధం లేదు..

తిరుమల శ్రీవారి ప్రసాదం.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రోజు రోజుకు వివాదం ముదురుతూనే ఉంది. ఈ పాపానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు.. పక్క రాష్ట్రాలనుంచీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో.. చంద్రబాబు ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యులతో కలిసి సిట్‌ ఏర్పాటు చేసింది. డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి లీడ్‌ చేస్తున్న ఈ టీమ్.. రంగంలోకి దిగేసింది. ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో విచారణ జరుపనుంది. ఇవాళ తిరుపతికి సిట్‌ వెళ్లనుంది. లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై విచారించనుంది. డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సహా తిరుపతికి సిట్‌ బృందం చేరుకుంటుంది. టీటీడీ ఈవోను కలిసి కేసుకు సంబంధించి డీటేల్స్ తీసుకోనుంది. తొలుత AR డెయిరీపై నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరుపనుంది. ఇప్పటికే డీజీపీతో సమావేశమై విచారణ చేయాల్సిన వాటిపై సిట్‌ చర్చించింది.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

గత ప్రభుత్వం హయాంలో తిరుమలకు నెయ్యిని ఎక్కడెక్కడ నుంచి కొనుగోలు చేశారు.. టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు.. ఆ కంపెనీల లావాదేవీలేంటి.. దీనివెనుక ఎవరు కీలకపాత్ర పోషించారు లాంటి అంశాలపై సిట్ ఫోకస్ చేయనుంది. నెయ్యిపై గతంలో, రీసెంట్‌గా వచ్చిన రిపోర్టులను పరిశీలించనుంది. మరోవైపు.. టెండర్ల వ్యవహారంపై మాజీ ఈవో, మాజీ ఛైర్మన్లను కూడా విచారించే అవకాశం ఉంది. చివరకు లడ్డూ వ్యవహారంపై ఎక్కడెక్కడ కేసులు నమోదు అయ్యాయో వాటిని పరిశీలించనుంది.