IAS Anil Kumar Singhal: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు మరోసారి టీటీడీ ఈవోగా నియమితులైన అనిల్ కుమార్ సింఘాల్.. టీటీడీ ఈవోగా రోండోవసారి నియమితులైన మొదటి అధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ రికార్డుకెక్కారు.. గతంలో 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4వ తేదీ వరకు టీటీడీ ఈవోగా కొనసాగారు సింఘాల్.. గతంలో ఈవోగా సింఘాల్ సమర్థవంతంగా సేవలందించిన నేపథ్యంలో మరోసారి అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇటీవలే కేంద్ర సర్వీస్ నుంచి రాష్ట్రానికి వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అనిల్ కుమార్ సింఘాల్‌ను తాజా బదిలీల్లో టీటీడీ ఈవోగా నియమించింది సర్కార్.. ఇక, ఎల్లుండి టీటీడీ ఈవోగా రోండోవ సారి భాధ్యతలు స్వీకరించనున్నారు అనిల్ కుమార్ సింఘాల్..
Read Also: Asia Cup 2025: శాంసన్, సింగ్‌కు షాక్.. ఆసియా కప్‌లో భారత తుది జట్టు ఇదే!
కాగా, పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు… వచ్చే మూడేళ్లపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా పాలన జరగాలనే ఉద్దేశ్యంతో ఉన్నతాధికారుల మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టారు.. రైట్ పెర్సన్.. రైట్ ప్లేస్ అనే కాన్సెప్ట్ తో బదిలీలకు సంబంధించి కసరత్తు చేశారు. మొదటి దశలో 11 మంది ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి… టీటీడీ ఈవోగా ఏకే సింఘాల్ ను నియమించారు. గతంలో ఆయన టీటీడీ ఈవోగా సేవలు అందించారు.. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీ పొలిటికల్ సెక్రెటరీ గా నియామకం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం.. మరో సీనియర్ అధికారి ప్రస్తుతం హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న కృష్ణబాబు ను ఆర్ అండ్ బీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.. ఈయన స్థానంలో సౌరభ్‌గౌర్ కు బాధ్యతలు అప్పగించారు.
జి. అనంత రాము పర్యావరణ అటవీ విభాగం నుండి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం జరిగింది… గవర్నర్ కు ప్రస్తుతం సెక్రెటరీ గా ఉన్న హరి జవహర్ లాల్ కు రెవెన్యూ లో ఎండోమెంట్ ముఖ్య కార్యదర్శి గా బదిలీ చేశారు.. జీఏడీ పొలిటికల్ సెక్రటరిగా ఉన్న ముఖేశ్ కుమార్ మీనాను.. రెవెన్యూలో ఎక్సైజ్ విభాగానికి బదిలీ అయ్యారు.. అదనంగా మైన్స్ విభాగం బాధ్యతలు కూడా అప్పగించారు. కాంతిలాల్ దాండే – రోడ్లు, భవనాలు నుండి పర్యావరణ & అటవీ విభాగానికి బదిలీ చేశారు.. సౌరభ్ గౌర్ – సివిల్ సప్లైస్ నుండి హెల్త్ శాఖ సెక్రటరీగా బదిలీ చేసినా.. సివిల్ సప్లైస్ అదనపు బాధ్యతలు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. ప్రవీణ్ కుమార్ ను మైన్స్ నుండి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సి.శ్రీధర్ ను మైనారిటీస్ వెల్ఫేర్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.. ఎంవీ శేషగిరి బాబు ను లేబర్ విభాగం సెక్రటరీగా నియమించింది ప్రభుత్వం..