డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్స్, Moto Pen సపోర్ట్, స్మార్ట్ కనెక్ట్ ఫీచర్లతో వచ్చేస్తున్న Moto Pad 60 Neo.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moto Pad 60 Neo: మోటరోలా తన కొత్త టాబ్లెట్ Moto Pad 60 Neo ని భారతదేశంలో లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే Moto Pad 60 Pro తో మార్కెట్లో ఉన్న మోటరోలా, ఇప్పుడు బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ గా ఈ కొత్త మోడల్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త టాబ్లెట్ లాంచ్ తేదీ, కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మరి ఆ పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా..
జీఎస్‌టీ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన Toyota కార్ల ధరలు.. ఏకంగా రూ.3.49 లక్షల తగ్గింపు!
Also Read
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
- STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
- Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
సెప్టెంబర్ 12, మధ్యాహ్నం 12 గంటలకు Moto Pad 60 Neo భారతదేశంలో విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించింది. ఆ పోస్ట్ లో గమనించినట్లయితే.. ఈ టాబ్లెట్ డ్యూయల్-టోన్ గ్రీన్ కలర్‌లో వెనుక కెమెరా సెన్సార్‌తో కనిపిస్తుంది. ఇక ఈ టాబ్లెట్ ఫీచర్ల విషయానికొస్తే, ఇది 11 అంగుళాల, 2.5K డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్ ఉంటుంది. Moto Pad 60 Neo 5G కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. ఇది కేవలం 6.9 మి.మీ మందంతో, 490 గ్రాముల బరువుతో ఇది అత్యంత సన్నని, తేలికైన 5G టాబ్లెట్‌లలో ఒకటిగా నిలవనుంది.
Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు.. 11 మంది సీనియర్ IAS అధికారుల బదిలీ
వీటితోపాటు, ఈ టాబ్లెట్ Moto Pen కు అనుకూలంగా ఉంటుంది. ఈ పెన్ టిల్ట్ సపోర్ట్, తక్కువ లేటెన్సీ, బ్లూటూత్ ఆటో-కనెక్ట్, 4,096 స్థాయిల ప్రెజర్ సెన్సిటివిటీ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ప్యాడ్ కు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జర్ కూడా లభిస్తుంది. ఈ టాబ్లెట్‌లో క్వాడ్ స్పీకర్ సిస్టమ్ ఉంది. ఇది డాల్బీ అట్మాస్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 7,040mAh బ్యాటరీతో వస్తుంది. మోటరోలా స్మార్ట్ కనెక్ట్ ఫీచర్లు అయిన క్రాస్ కంట్రోల్, ఫైల్ ట్రాన్స్‌ఫర్ వంటివి కూడా ఇందులో ఉంటాయి. ఇకపోతే ఇదివరకు విడుదలైన Moto Pad 60 Pro ధర రూ. 26,999తో మొదలవ్వగా.. ఆ మోడల్‌తో పోలిస్తే Moto Pad 60 Neo తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు