NTV Telugu Site icon

Love couple suicide attempt: శ్రీవారి మెట్టు మార్గంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలించిన భర్త..

Love Couple

Love Couple

Love couple suicide attempt: శ్రీవారి మెట్టు మార్గంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది.. ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యయత్నం చేయడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.. పెళ్లై.. ముగ్గురు పిల్లలు ఉన్న ఓ మహిళ.. ఓ యువకుడి ప్రేమలో పడింది. మూడు రోజుల క్రితం ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. చంద్రగిరిలోని శ్రీవారిమెట్టు నడక మార్గం 450వ మెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే, పురుగుల మందు తాగిన తర్వాత సదరు మహిళ తన భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించింది.. దీంతో.. ఆమె భర్త హుటాహుటిన శ్రీవారిమెట్టు వద్దకు చేరుకున్నాడు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది గమనించి పురుగుల మందు తాగిన ఇద్దరిని రుయా ఆసుపత్రికి తరలించారు. యువకుడు పరిస్థితి విషమం ఉంది. పురుగుల మందు తాగింది చిత్తూరు టౌన్, బంగారురెడ్డి పల్లెకు చెందిన సతీష్, రాధికలుగా గుర్తించారు పోలీసులు… భార్యను, ఆమె లవర్‌ని భర్తే హాస్పిటల్ కు తరలించడం చర్చనీయాంశంగా మారింది.

Read Also: Viral Video: తిరుమలలో ఒంటిపై 25 కేజీల నగలు వేసుకొని హల్చల్ చేసిన గోల్డెన్ బాయ్స్..

Show comments