NTV Telugu Site icon

Bhumana Karunakar Reddy: జగన్‌ డిక్లరేషన్‌పై భూమన సంచలన వ్యాఖ్యలు.. ఆ హక్కు టీటీడీకి లేదు..

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy: వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన ఆసక్తి రేపుతోన్న వేళ.. టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసలు వైఎస్‌ జగన్ ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదంటున్నారు భూమన.. ఐదుసార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిని ఎలా అడిగుతారు డిక్లరేషన్? అని నిలదీశారు.. టీటీడీ డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వం పతనం ప్రారంభం అయినట్లే అవుతుందన్నారు.. ఇక, సోనియా గాంధీ డిక్లరేషన్ పెట్టలేదు.. దానికి సాక్షం నేనే అన్నారు.. తిరుమలకు నడిచివెళ్లే అడిగే అధికారం కూడా టీటీడీకి లేదన్నారు.. కానీ, వైఎస్‌ జగన్‌ కాలినడకన తిరుమల వెళ్తారని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.. ఒక భక్తుడిగా వెంకన్న క్షేత్రానికి జగన్ వస్తున్నారు‌.. దర్శినానికి వస్తుంటే అడుగు అడుగునా ఆటంకం సృష్టిస్తున్నారు.. చంద్రబాబు చెప్పినట్లు పోలీసులు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులను హౌస్ అరెస్ట్ చేశారు.. నగర వైసీపీ నేతలను, కార్యకర్తలు బెదిరిస్తున్నారు‌.. భయభ్రాంతులకు గురి చేస్తూ నోటీసులు ఇచ్చారు.. అసలు జగన్ అంటే ఎందుకు చంద్రబాబు కు భయం అని ప్రశ్నించారు..

Read Also: Uttarpradesh : రోడ్డుపై కారు పార్కింగ్ చేస్తే ప్రభుత్వం టోలు తీస్తది.. ఎంత వసూలు చేస్తుందంటే ?

భగవంతుని పట్ల అంతంతమాత్రమే నమ్మకం ఉన్న సూడో మనుషులు.. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని చేబుతున్నారని దుయ్యబట్టారు భూమన.. హిందూ ధర్మానికి విరుద్ధంగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు… ఐదు సార్లు సీఎం హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు జగన్ సమర్పించారని గుర్తుచేశారు.. లడ్డూ ఘటనలో డిఫెన్స్‌లో పడిపోయి ఇలాంటి పనులు చేస్తున్నారు అని మండిపడ్డారు.. పూజలు కూడా చేయకుండా ఇంటిలోనే ఉండాలని వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారు‌‌. వైసీపీ నేతలు పూజలు కూడా చేయకూడదా? ఎందుకు మీకు అంతా భయం..? అని నిలదీశారు.. 40 శాతం ఓట్లు సాధించిన జగన్ వెంటా ఎవరు లేరని చెప్పడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.. అది జరగని పని‌.. వ్యక్తిగత రాజకీయాల్లోకి దేవుడిని తీసుకుని రాకండి‌. చంద్రబాబు ఒకటి చేబితే‌.. పవన్ కల్యాణ్‌ మరొకటి చెబుతాడు.. హైందవ ధర్మాన్ని పవన్ ఒక్కడే కాపాడేవాడిలా మాట్లాడుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు..

Read Also: YS Jagan Tirumala Visit: వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన.. ఎన్డీఏ కూటమి నేతల కీలక నిర్ణయం..

వైఎస్‌ జగన్ తిరుమల వస్తుంటే ఇప్పుడు పవన్ కల్యాణ్‌ సన్నాయి నొక్కలు నోక్కుతున్నాడు.. మేమే హిందువులు అన్నట్లుగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు అని ఫైర్‌ అయ్యారు భూమన.. సనాతన ధర్మం పై మాకు విశ్వాసం ఉంది… చంద్రబాబు స్వయంగా జగన్ రావాలని ఆహ్వానం పంపాలి. జగన్ ను అడ్డుకుంటే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినట్లే.. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు.. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన జగన్ స్వామివారిని దర్శనం చేసుకునే వెళ్తారని స్పష్టం చేశారు.. చంద్రబాబు సైలెంట్ గా ఉండి మిత్ర పక్షాలను, పోలీసులను రెచ్చగొడుతున్నారు. నిన్నటి వరకు లడ్డూతో డైవర్షన్ పాలిటిక్స్ చేశారు‌‌‌.. లడ్డూలో పస తగ్గడంతో ఇప్పుడు డిక్లరేషన్ అంటూ మొదలెట్టారు‌ అంటూ మండిపడ్డారు భూమన కరుణాకర్‌రెడ్డి..