Times Now Survey: ఏపీలో ఇప్పుడు ఎన్నికలొస్తే.. వైసీపీదే ఘనవిజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Times Now Navbharat Survey Says That YCP Will Win With Huge Margin In 2024 AP Elections: 2024 ఎన్నికలు మరికొన్ని నెలల్లోనే రాబోతున్నాయి. ఏపీలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాయి. దీంతో.. ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరిది పైచేయి కాబోతోంది? ఎవరు అధికారంలోకి వస్తారు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే టైమ్స్ నౌ నవభారత్ తాజాగా ఓ సంచలన రిపోర్ట్‌ని వెల్లడించింది. ‘జన్ గన్ కా మన్’ పేరుతో ఓ సర్వే నిర్వహించిన ఈ సంస్థ.. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే, వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని ప్రకటించింది. ఏపీలో ఉన్న 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే.. 25కి 24 లేదా 25 వస్తాయని ఆ సర్వేలో తెలిపింది. అంతేకాదు.. దేశంలోనే వైసీపీ అతిపెద్ద మూడో పార్టీగా అవతరించే అవకాశం కూడా ఉందని పేర్కొంది.
Extramarital Affair: ప్రియుడి కోసం భార్య స్కెచ్.. మరో మహిళను రంగంలోకి దింపి..
Also Read
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ఇక ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మాత్రం.. సున్నా నుంచి ఒక స్థానం మాత్రమే వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ నవభారత్ తన నివేదికలో తెలిపింది. అంతకుమించి ఆ పార్టీ ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. ఇక జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకైతే.. ఒక్క సీటు కూడా రాదని సర్వే అంచనా వేసింది. ఓటు శాతం చూసుకుంటే.. వైసీపీకి 51 శాతానికి పైగా ఓట్లు రావొచ్చని, టీడీపీకి 35-36 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా పార్టీలకు అంతంత మాత్రమే ఓట్లు నమోదయ్యే ఆస్కారం ఉందని ఆ సర్వే చెప్పుకొచ్చింది. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చడం, మేనిఫెస్టోకి కట్టుబడి ఉండటం వల్ల.. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని చెబుతోంది. అందుకే.. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతోందని అంచనా వేసింది. కాగా.. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. 22 లోక్‌సభ ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలను వైసీపీ గెలుచుకుంది.
Chris Gayle: గేల్, నీకసలు బుద్ధుందా.. విరాట్, రోహిత్ ఫ్యాన్స్ ఫైర్
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!