ఏపీలో నిన్న నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీలుగా లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, రమేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసారు. అయితే.. ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి వస్తున్న త్రిమూర్తులుకు రావులపాలెం ఘన స్వాగతం పలికారు వైసీపీ నేతలు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
read also :తమిళనాడులో బయటపడ్డ పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం
ఈ నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉందంటూ జాతీయ రహదారిపైకి రాకుండా అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తోట త్రిమూర్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం సిఐ జానకిరామ్ ను పిలిచి హెచ్చరించారు త్రిమూర్తులు. అనంతరం భారీ ఊరేగింపుతో తోట త్రిమూర్తులు మండపేట బయలుదేరి వెళ్లారు.