మరోసారి తిరుమల ఘాట్ రోడ్డు మూసివేత !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుండపోత వర్షంతో తిరుమల కొండకు వెళ్లే దారి మూతపడింది. ఉప్పెనలా పొంగిన వరదలతో కాలినడను కూడా భక్తుడు శ్రీవారి సన్నిధికి చేరే వీలులేకుండా పోయింది. ఆర్టీసీ బస్సులను నిలిపేయడంతోపాటు, రెండు ఘాట్ రోడ్లను మూసేయాల్సి వచ్చింది.తిరుమల కొండపై కురిసిన భారీ వర్షాలకు వరద నీరు మెట్ల మార్గంలో కిందకు పారుతోంది. దీంతో భక్తులు కొండపైకి ఎక్కలేని పరిస్థితి నెలకొంది. కొండ కిందే ఉన్న కపిలతీర్థంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
కొండ పైనుంచి ఉధృతంగా నీరు కిందకు పడుతోంది. దీంతో కపిల తీర్థం గుండం పొంగి, రోడ్డుపైకి వచ్చి చేరింది నీరు. దీంతో జనావాసాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రెండో ఘాట్ రోడ్డులోని 14వ కిలోమీటర్ వద్ద కొండ చరియలు విరిగిపడుతున్నాయి. గతంలో కురిసిన భారీ వర్షాలకు ఘాట్‌రోడ్‌లో మట్టి తడిసి పోయింది. ఇప్పుడు పడుతున్న వర్షానికి చెట్లు కూలుతున్నాయి. దీంతో ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు అధికారులు.మునుపెన్నడూ ఇలాంటి వర్షాన్ని చూడలేదంటున్నారు తిరుపతి వాసులు. భారీ వర్షం కారణంగా స్వామివారి చెంతకు చేరే దారులను ముసివేసిన సందర్భం లేదంటున్నారు. వరదకు దుకాణాలు సైతం కొట్టుకుపోయాయి. తిరుమల కొండపై అనేక చోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయి. దీంతో వాటిని తొలగిస్తున్నారు అధికారులు.
Also Read
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- CM Chandrababu: డీఎస్సీపై కౌంటర్ ఎటాక్.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
- YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
- Tags
- ghatroad
- Heavy rains
- tirumala
తాజావార్తలు
-
Realme P4s Lite: రియల్మీ P4s లైట్.. 7000mAh బ్యాటరీతో చౌకైన ఫోన్.. ఫీచర్లు అదిరిపోయేలా!
-
Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
-
India – Pakistan: మొదట భారత్ తరఫున ఆడి.. ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున ఆడిన క్రికెటర్లు వీరే..!
-
Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
-
CM Vijay: “1967 నాటి తప్పు పునరావృతం కావొద్దు”.. ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ..
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!