కుండపోత వర్షంతో తిరుమల కొండకు వెళ్లే దారి మూతపడింది. ఉప్పెనలా పొంగిన వరదలతో కాలినడను కూడా భక్తుడు శ్రీవారి సన్నిధికి చేరే వీలులేకుండా పోయింది. ఆర్టీసీ బస్సులను నిలిపేయడంతోపాటు, రెండు ఘాట్ రోడ్లను మూసేయాల్సి వచ్చింది.తిరుమల కొండపై కురిసిన భారీ వర్షాలకు వరద నీరు మెట్ల మార్గంలో కిందకు పారుతోంది. దీంతో భక్తులు కొండపైకి ఎక్కలేని పరిస్థితి నెలకొంది. కొండ కిందే ఉన్న కపిలతీర్థంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొండ పైనుంచి ఉధృతంగా నీరు కిందకు…
ఒకవైపు వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలతో తిరుమల వెళ్ళే భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. గురువారం రాత్రి 8 గంటలకు రెండు ఘాట్ రోడ్ల మూసివేస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ. తిరిగి రేపు ఉదయం 6 గంటల నుంచి వాహనాలను ఘాట్ రోడ్డు లో అనుమతి ఇస్తామని ప్రకటించింది. ఘాట్ రోడ్డులో పలు ప్రాంతాలు కొండచరియలు విరిగిపడుతుండడంతో ముందస్తు జాగ్రత్తగా మొదటి ఘాట్ రోడ్డు మూసివేస్తోంది టీటీడీ. తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే భక్తులు 7 గంటలలోపు ప్రయాణం చెయ్యాలని విజ్ఞప్తి…