జగన్ సర్కార్ ఆధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో అమరావతి అభివృద్ధికి భూములిచ్చి రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 45 రోజుల మహా పాదయాత్రకు రాజధాని రైతులు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర నవంబర్ 1 నుంచి ప్రారంభమైంది. నేడు రెండవ రోజు పాదయాత్రను ప్రారంభించనున్నారు.
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తాడికొండ నుండి గుంటూరు శివారు ప్రాంతం వరకు 12.6 కిలో మీటర్ల పాదయాత్రను రైతులు చేయనున్నారు. రైతుల వీరి పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పులువురు నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయం మార్చుకోవాలంటూ రాజధాని రైతుల పాదయాత్ర కొనసాగనుంది.