Maredumilli Selfie Video Goes Viral: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో పురుగుల మందు తాగుతూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో కలకలం రేపింది. మారేడుమిల్లి ఆర్ఎస్ రిసార్ట్‌లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. అన్నదమ్ముల మధ్య ఆర్థిక లావాదేవీలలో తనను అన్నయ్య, వదిన మోసం చేశారంటూ సెల్ఫీ వీడియోలో పురుగుల మందు తాగుతూ పేర్కొన్నాడు యాకూబ్ భాష అనే వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నమ్మకద్రోహం చేసి నన్ను…
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎంకౌంటర్ జరిగింది. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని దేవిపట్నం మండలం కించకూరు-కాకవాడి గండి అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. Also Read: Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్!…
ఏలూరు శ్రీ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు మారేడుమిల్లి వద్ద గుడిసె విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. కారును క్రేన్ సహాయంతో పోలీసులు బయటికి తీశారు. మృతులు ఉదయ్ కిరణ్, హేమంత్, హర్షవర్థన్ అనే విద్యార్థులుగా గుర్తించారు. పదిమంది విద్యార్థులు రెండు కార్లలో విహారయాత్రకు వెళ్లి వస్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక భూపతిపాలెం ప్రాజెక్టులోకి తెల్లవారుజామున ప్రమాదవశాత్తు దూసుకు వెళ్ళిందో స్కార్పియో వాహనం. ఈవాహనంలో సుమారు 350 కేజీల గంజాయి తరలిస్తూ పోలీసులు వెంబడించడంతో నిందితులు పారిపోయే ప్రయత్నంలో ఈఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నం సరిహద్దుల నుంచి మారేడుమిల్లి మీదుగా అక్రమంగా తరలిస్తున్న గంజాయి వాహనాన్ని వెంబడించారు పోలీసులు. భూపతిపాలెం వద్ద జరిగిన ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొనగా, మరొక వ్యక్తి పరారయ్యాడు. ప్రాజెక్టు కాలువలోకి దూసుకెళ్లిన వాహనాన్ని…
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తూర్పు మన్యంలోని మారేడుమిల్లిని చలి వణికిస్తుంది. చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ర్టంలో వరుసగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తన ప్రభావాన్ని చూపిస్తుంది. పగటి పూట సైతం చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. Read Also: హైదరాబాద్‌లో రికార్డు సృష్టించిన ‘చలి’ మారేడు…