Site icon NTV Telugu

పీఆర్సీపై ఉత్కంఠ.. ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ కానున్న ఏపీ ప్రభుత్వం..

11వ పీఆర్సీపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానుంది. ఇప్పటికే పలు మార్లు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. సీఎస్‌ సమీర్‌ శర్మకూడా ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలో పీఆర్సీపై ముచ్చటించారు. అయినప్పటికీ పీఆర్సీపై స్పష్టత నెలకొనలేదు.

అయితే ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్‌తో భేటీ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా త్వరలోనే సీఎం జగన్‌ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమవుతారని చెప్పడంతో ఉద్యోగ సంఘాల నేతల్లో ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేందర్‌ ఉద్యోగ సంఘాల నేతలతో ఈ రోజు భేటీ కానున్నారు.

https://ntvtelugu.com/whats-today-updates-30-12-2021/
Exit mobile version