Kakinada Theft: కాకినాడలో విచిత్ర దొంగతనం.. క్షమాపణ లేఖ రాసి బంగారం తిరిగిచ్చిన యువకులు.. చివరకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ జిల్లా కరప మండలంలో జరిగిన ఓ విచిత్ర దొంగతనం ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇంట్లో చోరీ చేసిన దొంగలు కొద్ది రోజులకే క్షమాపణ లేఖ రాసి దొంగిలించిన బంగారం, నగదును ఇంట్లోకి విసిరి వెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు.
కరపలో స్థానికంగా నివాసముంటున్న గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించాడు. దుండగులు సుమారు రూ.6.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, అలాగే రూ.50 వేల నగదు అపహరించారు. ఈ ఘటనపై గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ దొంగతనానికి తెలిసిన వారే కారణమై ఉండొచ్చని అతనికి అనుమానం మొదలైంది.
Also Read
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
- Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా.. భయపడిన దొంగలు దొంగిలించిన బంగారం, మిగిలిన నగదును గణేష్ ఇంట్లోకి విసిరి వెళ్లిపోయారు. వాటితో పాటు ఒక లేఖను కూడా పెట్టారు. ‘మేము చేసిన పని తప్పే. దొంగిలించిన నగదులో రూ.22 వేలు మా వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేశాం. ఆ డబ్బు మాత్రం తిరిగి ఇవ్వలేం. మమ్మల్ని క్షమించండి’ అని లేఖలో రాసి పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించారు. తెలిసిన వారే ఈ పని చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ.. వెంటనే నిజం ఒప్పుకుంటే సమస్యలు సమసిపోతుందని, లేకపోతే కుల సంప్రదాయాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామ పెద్దల హెచ్చరికతో ముగ్గురు యువకులు తామే దొంగతనం చేసినట్లు అంగీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మిగిలిన బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు ఉండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?