Durgamme Temple: భారీవర్షం.. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి తెప్పోత్సవానికి బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా అనగానే ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి మామూలుగా వుండదు. అందునా దసరా చివరిరోజు కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవం ఎంతో ప్రసిద్ధం. ఏటా నిర్వహించే శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈసారి భక్తులకు వర్షం షాకిచ్చింది. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో తెప్పోత్సవం రద్దయింది. దీంతో తెప్పోత్సవం రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు దుర్గగుడి అధికారులు, అర్చకులు. .ఆగమ శాస్ర్తం ప్రకారం వర్షం పడుతున్నప్పుడు శివాలయం నుంచి ఉత్సవమూర్తులను బయటకు తీయకూడదని పండితులు చెబుతున్నారు. దీనికి తోడు ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద కూడా చేరింది.
దుర్గగుడి స్ధానాచార్య మాట్లాడుతూ.. వర్ష ప్రభావం చేత తెప్పోత్సవాన్ని రద్దు చేస్తున్నాం అన్నారు. వర్షం పడుతుంటే శాస్ర్తం ప్రకారం ఉత్సవ మూర్తులను బయటకు తీయకూడదు. విగ్రహాలు తడిస్తే స్నానాభిషేకాలు చేయాలి. వాతావరణం అనుకూలించకపోవడం వలనే తెప్పోత్సవాన్ని నిర్వహించలేకున్నాం. 21 ఏళ్ల క్రితం తెప్పోత్సవం నిర్వహించలేదు. మరలా ఇన్నేళ్ల తర్వాత వర్ష ప్రభావం రీత్యా తెప్పోత్సవం ఆగిందన్నారు. తొలుత పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ కి విడుదలయింది. 30వేల క్యూ సెక్కుల లోపు ఇన్ ఫ్లో ఉంటేనే జల వనరుల శాఖ తెప్పోత్సవానికి అనుమతిస్తుంది. ఇన్ఫ్లో తగ్గకపోవడంతో నిరభ్యంతరపత్రం ఇవ్వలేమని జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. దీంతో తెప్పోత్సవం నిర్వహణ కష్టమన్న నిర్ణయానికి ఉత్సవాల కమిటీ వచ్చింది. గడచిన ఏడాది వరద కారణంగా వేద పండితులను మాత్రమే పంటు మీద తెప్పోత్సవానికి అనుమతించారు అధికారులు.
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Read Also: Fake Job Racket: నకిలీ జాబ్స్ మోసం.. మయన్మార్ నుంచి 13మంది ఇండియన్స్ సేఫ్
ఊరేగింపు రద్దుతో ఆలయానికే పరిమితమయ్యాయి ఉత్సవ మూర్తులు. వన్ టౌన్ పోలీసులకు దక్కని అమ్మవారి ఉత్సవ మూర్తుల విగ్రహాలు. తెప్పోత్సవం అనంతరం ఉత్సవ మూర్తులను వన్ టౌన్ పోలీసులకు అప్పచెప్పడం ఆనవాయితీ. ఈ ఏడాది వర్ష ప్రభావం రీత్యా తెప్పోత్సవం ఆగిపోయింది. ఆలయంలోనే ఉత్సవ మూర్తులు వుండిపోయాయి. పూజాది కార్యక్రమాలు శివాలయం పరిసర ప్రాంతంలోనే నిర్వహిస్తున్నారు అర్చకులు. సాధారణంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ చేయడం ఆనవాయితీ. ఏటా ఆనవాయితీగా వన్ టౌన్ పోలీసులు మంగళవారం ఆయుధపూజ నిర్వహించారు…భూమిపై దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసే అవకాశాన్ని పోలీసులకు అమ్మవారు కల్పించారనే నమ్మకం….
అమ్మవారి ఎదుట 303 రైఫిల్స్ మరియు 9mm పిస్టల్ ఉంచి ఆయుధ పూజ నిర్వహించారు వన్ టౌన్ పోలీసులు. ఇందులో పోలీసులు, పోలీసు కుటుంబసభ్యులు ఈ పూజలో పాల్గొన్నారు. మంచికి న్యాయం చేసే విధంగా అస్త్రాలు ఉపయోగించాలని, ఆయుధాలకు పూజ చేశారు. ఆంగ్లేయుల కాలం నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అమ్మవారు పోలీసు వారి ఆడపడుచుగా కొలుస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గమ్మ వారు ఇక్కడికి రావడం తమ సారె అందుకోవడం అనాదిగా వస్తున్న ఆచారమని పోలీసులు తెలిపారు. మహర్నవమి సందర్భంగా అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఉండడం, అదే రూపాన్ని పోలీసు సిబ్బంది, కమిటీ వారు పోలీస్ స్టేషన్ లో అలంకరణ చేయడం జరిగింది. చట్టానికి అనుగుణంగా ఉపయోగించే ఆయుధాలకు పూజ చేస్తారు. ఆయుధాలను మంచి కోసం ఉపయోగించాలని అమ్మవారు చెబుతారు.
Read Also: HD Kumaraswamy: కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తాం
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు