సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని కుటుంబ సభ్యులతో సహా పూజా కార్యక్రమాలతో సేవించి, తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “ఓం నమో భవానీ… అమ్మ మా అమ్మ.. దుర్గమ్మను నాకు చిన్నప్పుడు చూపించి ఈవిడే నీ అమ్మరా అన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మేళతాళాలు కొని తెచ్చి అమ్మకి ఇచ్చే అవకాశం నాకు దక్కింది. మూల నక్షత్రం రోజు రావడం కుదరలేదు.…