TTD: శ్రీవారి సర్వదర్శనం టికెట్ల కోసం తొక్కిసలాట..! టీటీడీ కీలక నిర్ణయం..
కరోనా మహమ్మారి శ్రీవారిని దర్శన విదానాన్ని కూడా మార్చేసింది.. ప్రత్యేక దర్శనం అయినా.. సర్వదర్శనం అయినా టికెట్లు తప్పనిసరి చేసింది టీటీడీ… కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శనం కల్పించేందుకు వీలుగా.. ఆన్‌లైన్‌లో కోటా పెట్టి దర్శనం కల్పిస్తూ వస్తోంది.. శ్రీవారి సర్వదర్శన టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.. సర్వదర్శనం టికెట్లు ఇచ్చే క్యూ లైన్ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.. వేలాది మంది ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది.. ఓ దశలో తొక్కిసలాట కూడా జరిగినట్టు చెబుతున్నారు. క్యూలైన్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి.. క్యూలైన్‌లో పలువరు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన పలువరు భక్తులు కన్నీటి పర్యంతం అయ్యారు.. టీటీడీ సరైన ఏర్పాట్లు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Farmers: ఎంపీ అర్వింద్‌కు నిరసన సెగ.. ఇంటి ముందు వడ్లు పోసి ఆందోళన..
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గోవిందరాజస్వామి సత్రాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. రంగంలోకి దిగిన తిరుపతి పోలీసులు భక్తులను కంట్రోల్ చేసి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.. క్యూ లైన్లలో తోపులాటలతో పదుల సంఖ్యలో భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు.. తాగేందుకు కనీసం నీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసి భక్తులు.. టికెట్ల జారీలో టీటీడీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. భక్తుల తోపులాటలో చాలామంది పిల్లలు తప్పిపోయినట్టు చెబుతున్నారు.. పోలీసుల లేకపోతే మా పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని భక్తులు వాపోయారు.. ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ స్పందించలేదని విమర్శిస్తున్నారు.. ఇక, భక్తుల రద్దీని దృష్టిలో పుట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ.. టికెట్లు లోకపోయినా సర్వదర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.. నేరుగా కొండపైకి చేరుకోవాలని సూచించారు. అయితే, ఇప్పటికే టికెట్లు తీసుకున్నవారి పరిస్థితి ఏంటి? అనేది తెలియాల్సి ఉన్నా.. మరోవైపు.. భక్తుల రద్దీని దృష్టిలోపెట్టుకున్న టీటీడీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.. రేపటి నుంచి ఆదివారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది టీటీడీ.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
-
Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి షాకింగ్ కామెంట్స్.. “రాత్రి 12 గంటలకు నా రూమ్‌లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!”
-
Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్‌మిలన్ ధరలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో