Selfie Video : రష్యా యుద్ధ క్షేత్రంలో ఐదుగురు తెలుగు యువకులు.. ‘ఇదే మా చివరి రోజు కావచ్చు’.!
- ఉద్యోగాల పేరుతో రష్యాకు తీసుకెళ్లిన ఏజెంట్
- ఫుడ్ ప్యాకింగ్ ఉద్యోగమంటూ నమ్మించి మోసం
- యుద్ధ క్షేత్రంలో చిక్కుకున్న ఐదుగురు తెలుగు యువకులు
- తమను కాపాడాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేడుకోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపాధి కోసం రష్యా వెళ్లిన విశాఖపట్నానికి చెందిన ఇద్దరు యువకులతో సహా ఐదుగురు తెలుగు యువకులు అక్కడి యుద్ధ క్షేత్రంలో తీవ్ర ప్రాణభయంతో అల్లాడుతున్నారు. రష్యా సైన్యంలో ‘ఫుడ్ ప్యాకింగ్’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నేపాల్‌కూ చెందిన ఒక ఏజెంట్ వీరిని నమ్మించి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తీరా అక్కడికి వెళ్లాక, నకిలీ కాంట్రాక్టులతో వారిని మోసం చేసి రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులోని భయంకరమైన యుద్ధ రంగానికి బలవంతంగా పంపించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘ఇదే మా చివరి రోజు కావచ్చు’.. సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతం
సరిహద్దుల్లో సైన్యం పహారా నడుమ చిక్కుకుపోయిన ఈ యువకులు తాజాగా ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. “ఇక్కడ ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బహుశా ఇదే మాకు చివరి రోజు కావచ్చు. కనీసం మేము బతికి బయటపడతామో లేదో కూడా చెప్పలేం” అని కన్నీళ్లు పెట్టుకుంటూ వారు తమ దీనస్థితిని వివరించారు. బాంబుల మోతలు, తుపాకుల శబ్దాల మధ్య ప్రతి క్షణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
- Cyclone Murasu: 'అర్నబ్' కంటే.. 'మురసు' తుఫాన్ ప్రభావం తక్కువే!
- CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
- Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
కాపాడాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేడుకోలు
తాము మోసపోయామని గ్రహించేలోపే సరిహద్దుల్లోకి నెట్టేశారని, భారత ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ ప్రాణాలను కాపాడాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు చేపట్టి, తమను సురక్షితంగా స్వదేశానికి, కన్నవారి వద్దకు చేర్చేలా సహాయం చేయాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు. విశాఖకు చెందిన ఈ యువకుల కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన చెందుతూ, తమ పిల్లలను క్షేమంగా రప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Selfie Video : రష్యా యుద్ధ క్షేత్రంలో ఐదుగురు తెలుగు యువకులు.. ‘ఇదే మా చివరి రోజు కావచ్చు’.!
-
Reliance: మార్కెట్లో అంబానీ సునామీ.. ఒక్క రోజే రూ. 1.29 లక్షల కోట్లు జంప్!
-
US Plane Crash: భయంతో అరిచిన పైలట్.. క్షణాల్లో కుప్పకూలిన విమానం.. వెలుగులోకి చివరి క్షణాలు.!
-
Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
-
CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!