Ukraine Students: స్వదేశానికి చేరుకుంటున్న విద్యార్ధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులు ఒక్కొక్కరుగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు బెంగళూరు, హైదరాబాద్ చేరుకుని తమ తమ ప్రాంతాలకు వెళుతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు 23 మంది తెలంగాణ విద్యార్థులు. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ… ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరారు విద్యార్ధులు. హైదరాబాద్ శంషాబాద్ లో ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థిని రిసీవ్ చేసుకున్నారు అధికారులు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సాయి స్కందనను రిసీవ్ చేసుకున్నారు పత్తికొండ తహశీల్ధార్. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా రావడానికి సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపింది స్కందన.
ఉక్రెయిన్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తెలుగు విద్యార్థులకు ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానం లో బయలు దేరిన విద్యార్థులు గన్నవరం చేరుకున్నారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. పిల్లల్ని చూసిన తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. వీరిలో వంశీ (గుంటూరు),అభిషేక్ (తెనాలి) ఫర్జానా (కానూరు), అనూష (కౌతవరం) గ్రామాలకు చెందిన విద్యార్థులున్నారు.
Also Read
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో స్వగృహానికి చేరారు ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్న విద్యార్ధినులు. సుష్మా, సుదర్శనలను రిసీవ్ చేసుకున్న కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉక్రెయిన్ వెస్ట్రన్ లో తాము వున్నామని, అక్కడ యుధ్ధం ప్రభావం అంతగా లేదన్నారు విద్యార్ధినులు. ఈస్ట్రన్ ఉక్రెయిన్ లో యుధ్ధం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మా యునివర్సిటీ రుమేనియా బోర్డర్ కు దగ్గర ఉండటంతో త్వరగా రాగలిగాం. ఇంకా 15 వేల మందికి పైగా భారతీయ విద్యార్ధులు ఉక్రెయిన్ లో ఉండిపోయారు.
సైరన్ మోగినప్పుడు మెట్రో స్టేషన్, బంకర్స్ లో తలదాచుకున్నామని, అక్కడ పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుక్కున్న విద్యార్ధులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు వేగంగా జరగాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని వెనక్కి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు మరువలేమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు విద్యార్ధినుల తల్లిదండ్రులు. బెంగళూరు విమానాశ్రయంలో దిగారు చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన ఉక్రెయిన్ విద్యార్థులు. వీరిని రిసీవ్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. అక్కడి నుంచి సొంత ఊరు చేరుకునేందుకు వాహన సదుపాయం కల్పించారు అధికారులు.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్‌లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!