Somesh Kumar Applies For VRS: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేసిన విషయం విదితమే.. అయితే, సీఎస్‌గా ఉన్న సోమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీకి వెళ్లినా.. వెంటనే వీఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఆది నుంచి జరుగుతూ వచ్చింది.. మరోవైపు.. ఈ ఏడాది చివర్లో ఆయన పదవీ కాలం ముగియనుండడంతో.. అప్పటి వరకు పదవిలో కొనసాగుతారని..! పూర్తి స్థాయి సర్వీస్ కంప్లీట్ చేస్తారని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు.. అయితే, ఏపీ జీఏడీలో రిపోర్టు చేసిన సోమేష్ కుమార్.. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఏపీ ప్రభుత్వం ఆయనకు ఇప్పటి వరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. తెలంగాణ సీఎస్‌గా చేసిన వ్యక్తికి.. ఏపీలో తక్కువ పోస్టులో పని చేయడానికి ఇష్టపడడంలేదనే వార్తలు కూడా వచ్చాయి.. తాజా సమాచారం ప్రకారం కొద్ది రోజుల క్రితం సోమేష్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్న.. దీనికి ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలుస్తోంది.
Read Also: Machu Picchu: ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్ ‘మచు పిచ్చు’ రీఓపెన్.. సందర్శనకు అనుమతి
కాగా, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో బీహార్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సోమేష్ కుమార్‌ను ఏపీ క్యాడర్‌కు కేటాయించారు.. అయితే, క్యాట్ ఉత్తర్వుల మేరకు తెలంగాణలోనే కొనసాగారు.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేశారు. కానీ, క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయడంతో హైకోర్టు ఆయనను తక్షణం ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేయడం.. మరో అవకాశం లేకపోవడంతో ఆయన ఏపీలో రిపోర్ట్ చేశారు.. ఇక, హైకోర్టు ఆదేశాల తర్వాత సోమేష్ కుమార్‌కు ఏపీకి వెళ్లడం ఇష్టంలేదని.. వీఆర్‌ఎస్ తీసుకుంటారని.. గతంలో కొందరు కీలక అధికారులను తన సలహాదారులుగా పెట్టుకున్న సీఎం కేసీఆర్.. సోమేష్ కుమార్‌ను కూడా తన దగ్గర పెట్టుకుంటారనే ప్రచారం సాగింది.. మరి, ఇప్పుడు ఏపీలో వీఆర్ఎస్ తీసుకుని.. మళ్లీ కేసీఆర్ దగ్గరకే వస్తారా? అనేది వేచిచూడాల్సిన విషయం.