Site icon NTV Telugu

Tdp Vs Ysrcp: టెన్త్ ఫలితాలపై వైసీపీ-టీడీపీ ట్విట్టర్ వార్

Tdpvsysrcp

Tdpvsysrcp

ఏపీలో పదవతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాల పై వైసీపీ, టీడీపీ ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ట్విట్టర్ లో లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టెన్త్ లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ‘నారాయణ’ ప్రశ్న పత్రాలను లీక్ చేయడమే కారణం పప్పు నాయుడూ. పిల్లల్ని అయోమయంలోకి నెట్టి మానసికంగా డిస్టర్బ్ చేసిన పాపం మీదే.
దిగజారి ఆరోపణలు చేయడంలో ముందుంటావు. చదువు’కొన్న’వాడివి. నువ్వు రిజల్ట్ గురించి మాట్లాడటం ఏమిటి? అంటూ ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయి.

అంతకుముందు ఫలితాల అనంతరం లోకేష్ ప్రభుత్వం పై మండిపడ్డారు. పదో తరగతి ఫలితాలలో కుట్ర జరిగిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. టెన్త్‌లో ఎక్కువ మంది పాసైతే అమ్మ ఒడితో పాటు ఇంట‌ర్‌, పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇవ్వాల్సి వ‌స్తుంద‌నే కుట్రతోనే ఎక్కువ‌ మందిని ఫెయిల్ చేశార‌ని మండిపడ్డారు. అయితే ఇది టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదని.. స‌ర్కారు ఫెయిల్యూర్ అంటూ లోకేష్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన టెన్త్ ప‌రీక్షల్లో పేప‌ర్ లీక్‌, మాస్ కాపీయింగ్‌, మాల్ ప్రాక్టీసుల‌ కారణంగా అభాసుపాలైందని ఎద్దేవా చేశారు.

టెన్త్ రిజ‌ల్ట్స్‌ వాయిదా, దిగ‌జారిన ఫ‌లితాలన్నీ స‌ర్కారు కుతంత్రమే అని ఫైరయ్యారు.20 ఏళ్లలో అతి త‌క్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత న‌మోదైనట్లు లోకేష్ గుర్తుచేశారు. టెన్త్‌లో దారుణ ఫ‌లితాలు ప్రభుత్వం పాప‌మేనన్నారు. ప‌దో త‌ర‌గ‌తి క‌ష్టప‌డి చ‌దివి పాసై ఉంటే వైఎస్ జ‌గన్‌కు విద్యార్థుల క‌ష్టాలు తెలిసేవని లోకేష్ కౌంటర్లు వేశారు. కరెంట్ కోతలు, ప‌రీక్షా స‌మ‌యం కుదింపు, పేపర్ లీక్‌, మాల్ ప్రాక్టీస్‌, మాస్ కాపీయింగ్‌ తక్కువ ఉత్తీర్ణతకు కారణం అన్నారు లోకేష్. దీనిపై విజయసాయి స్పందించారు.

Internet Open: అక్కడ ఇంటర్నెట్ కష్టాలకు చెక్

Exit mobile version