హెటేరో ఫార్మా కంపెనీ పైపులైన్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించింది టీడీపీ. నక్కపల్లి(మం)రాజయ్యపేట దగ్గర మత్యకారులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. అయితే నేటితో 12వ రోజుకు చేసుకుందిమత్స్యకారుల శాంతియుత ధర్నా. అక్కడ ఆవిడ మాట్లాడుతూ… సముద్రంలోకి పంపుతున్న రసాయన వ్యర్థజలాలు వల్ల మత్యసంపాద నశించుపోతుంది. మత్యకారులు అందరూ కూడా వలసలు వెళ్లి బ్రతకావలసిన పరిస్థితి వచ్చింది. అనుమతులు లేకుండా పైపులైన్ వేస్తుంటే అధికారులు ప్రభుత్వం హెటేరో ఫార్మా కంపెనీ కి సపోర్ట్ చేయడం దారుణం అని వంగలపూడిఅనిత పేర్కొన్నారు.