Kollu Ravindra: మూడేళ్లలో 37 మంది కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ పాలనలో నిత్యం హత్యలు, దాడులు, మహిళలపై మానభంగాలతో రాష్ట్రం వల్లకాడులా మారిందని విమర్శించారు. మాచర్లలో జల్లయ్య హత్య ముమ్మూటికి వైసీపీ ప్రభుత్వ హత్యే అని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా పోస్టుమార్టం చేసి తీసుకెళ్లారని.. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా టీడీపీ నేతల్ని, బీసీ సంఘాల నేతల్ని హౌస్ అరెస్టులు చేయటం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత పిన్నెల్లి తన స్వార్థం కోసం పల్నాడును వల్లకాడుగా మార్చారన్నారు.
Devineni Uma : ఆ విషయంలో జగన్ జైలు కెళ్లడం ఖాయం
Also Read
- Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. టీటీడీ చరిత్రలోనే మొదటిసారి!
- Dhavaleswaram Barrage Flood: ధవలేశ్వరం బ్యారేజీకి వరద ఉధృతి.. కొనసాగుతోన్న రెండో ప్రమాద హెచ్చరిక!
- TDP vs YCP: చిప్పగిరిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే విరూపాక్షి!
చంద్రయ్య హత్య జరిగినప్పుడే పిన్నెల్లిపై హత్య కేసు నమోదు చేసి ఉంటే జల్లయ్య హత్య జరిగేది కాదని కొల్లు రవీంద్ర అభిప్రాయపడ్డారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో 37 మంది టీడీపీ కార్యకర్తలను జగన్ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. వైసీపీ పొట్టన పెట్టుకున్న వారిలో 26 మంది బీసీలే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ బీసీలపై జగన్ మారణ హోమం సాగిస్తూ ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అణగదొక్కుతున్నారని కొల్లు రవీంద్ర విమర్శలు చేశారు. 10 మందికి మంత్రి పదవులు ఇచ్చి వందల మంది బీసీల ప్రాణాలు తీయడం సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు. జగన్ అరాచక పాలనపై అన్ని పక్షాలను కలుపుకుని పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
-
Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
-
Vijay Sethupathi : ఇకపై గెస్ట్ రోల్స్ చేయను.. ఆ ఒక్క సినిమా తప్ప
-
Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!