సీఎం జగన్ అమూల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు: దూళిపాళ్ల నరేంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అలవోకగా అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ సీనియర్‌నేత దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అర్థసత్యాలు, అసత్యాలతో రాష్ర్టంలోని పాడి రైతులను మోసగిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా లీటర్ పాలకు ఇస్తానన్న రూ.4ల బోనస్ జగన్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. 1950, 60 దశకాల్లో రాష్ట్రంలో ప్రారంభమైన పాడిరైతుల సహాకారసమాఖ్యల మూసివేతకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం జగన్ అమూల్ కి బ్రాండ్ అంబాసిడరుగా వ్యవహరిస్తున్నారు. ఏపీలోని పాల డెయిరీలను సీఎం జగన్ నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు. అమూల్ కోసం రూ.2,500ల ప్రభుత్వ సొమ్ము ఖర్చుపెడుతున్న జగన్.. మూతపడిన ఒంగోలు డెయిరీకి రూ.150 కోట్లు కేటాయించ లేరా..? అంటూ ప్రశ్నించారు. దాదాపు 30 వేల మంది రైతుల నుంచి 168 లక్షల లీటర్ల పాలను అమూల్ సేకరిస్తోందని, రూ.71 కోట్లను పాడి రైతులకు అందించిందని జగన్ చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.
Read Also:ఇళ్ల మధ్యలో పబ్‌ల ఏర్పాటు పై హైకోర్టులో విచారణ
Also Read
ఆయన లెక్కప్రకారం అమూల్ సంస్థ లీటర్ పాలకు రూ.42.50 పైసలు చెల్లిస్తుంటే, జగన్‌మోహన్ రెడ్డి రూ.70లు అని చెప్పడం పచ్చి అబద్ధం కాదా? అంటూ విమర్శించారు. విజయ డెయిరీ 11 శాతమున్న లీటర్ పాలకు రూ.85.55పైసలు ఇస్తుంటే, అమూల్ సంస్థ ఇస్తున్నది కేవలం రూ.77లు మాత్రమేనని పేర్కొన్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తున్న అమూల్ డెయిరీ వల్ల రాష్ట్రానికి అప్పులే మిగులుతాయన్నారు. కృష్ణామిల్క్ యూనియన్ సహా, రాష్ట్రంలోని మిల్క్ డెయిరీలను నిర్వీర్యం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యంగా కనిపిస్తున్నదని ఆయన వెల్లడించారు.
పశువుల బీమాకు సంబంధించిన సొమ్ముని ఎగ్గొట్టిన వైసీపీ ప్రభుత్వం, గోపాల మిత్రల భవిష్యత్తును అంధకారం చేసేలా ప్రయత్నాలు చేస్తుందన్నారు. పశువైద్యులు వైద్యసేవలకు స్వస్తి పలికి, ప్రభుత్వం చెప్పే అడ్డమైన పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని నరేంద్ర దుయ్యబట్టారు. సేవాభావంతో పశువుల దాణా అమ్మేవారు ప్రభుత్వానికి రూ. 25వేల డిపాజిట్ కట్టాలనడం దుర్మార్గం కాదా? చిన్నచిన్న సొసైటీలు రూ.25వేలు కట్టేస్థితిలో ఉంటాయా అనే ఆలోచన సీఎంకు లేకపోవడం సిగ్గుచేటు చర్యగా నరేంద్ర పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!