వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.. విశాఖలో వైసీపీ నేతలు గంటకో ఘోరం, అరగంటకో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన.. 420 పార్టీలో విజయసాయిరెడ్డి, కొడాలి నాని లాంటి వాళ్లు 840లు అంటూ ఎద్దేవా చేశారు.. విశాఖలో వృద్ధాశ్రమ భూముల్నీ వైసీపీ నేతలు వదలట్లేదని విమర్శించారు.. విశాఖలో వైసీపీ సాగించిన భూ కబ్జా బాధితుల కోసం ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు బుద్దా వెంకన్న..
Read Also: Mahesh Babu: ఫస్ట్ టైమ్.. షర్ట్ లేకుండా బాడీని చూపించిన మహేష్.. పిచ్చెక్కిపోతున్న అభిమానులు
ఇక, త్వరలోనే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ విశాఖలో పర్యటించి హాయగ్రీవ వృద్దాశ్రమ భూముల కబ్జాను పరిశీలించనున్నట్టు వెల్లడించారు బుద్దా వెంకన్న.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వేస్తుంటే, లింగ నిర్ధారణేమోనంటూ కామెంట్లు చేస్తూ కొడాలి నాని కంగారు పడుతున్నారని సెటైర్లు వేశారు.. వైసీపీ అధికార ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్న అధికారులు గుర్తు పెట్టుకోవాలి.. టైమ్ దగ్గరపడిందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మరోవైపు.. తాడేపల్లిలో జగన్ బటన్ నొక్కుతుంటే, కెమెరాల ముందు వైసీపీ నేతలు బటన్ విప్పుతున్నారు అంటూ.. సీరియస్ కామెంట్లు చేశారు. కాగా, ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం, విశాఖలో భూ కబ్జాల విషయంలో.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.