Vijayawada Corporation: విజయవాడ కార్పోరేషన్ బడ్జెట్ పై టీడీపీ నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెజవాడ కార్పోరేషన్ పనితీరుపై విపక్ష టీడీపీ నిరసన తెలుపుతోంది. విజయవాడ నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా కౌన్సిల్ హాల్ కి నిరసన తెలుపుతూ వెళ్లారు టీడీపీ కార్పొరేటర్లు. విజయవాడ నగర పాలక సంస్థ మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వైసీపీ పాలకపక్షంపై కార్పోరేటర్ కేశినేని శ్వేత మండిపడ్డారు.
ఈ బడ్జెట్ నగర ప్రజలకు గుదిబండగా మారబోతుందన్నారు. గత మూడు సంవత్సరాలు నుండి నగరంలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం. గత సంవత్సర కాలం నుండి ఉన్న వైసిపి పాలకపక్షం రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమైంది. విజయవాడ నగరంలో స్థానిక మంత్రి ఉండి కూడా నగరం అభివృద్ధికి నోచుకోకపోవడం సిగ్గుచేటు. నగరంలో రోడ్లు కన్నా రోడ్ల పైన గుంటలు ఎక్కువగా ఉన్నాయి.
Also Read
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
గత సంవత్సర కాలం నుండి వైసీపీ పాలకపక్షం నగర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసి నిధులు తీసుకువచ్చే తీరిక లేకుండా ఉన్నారు. నగరంలో చెత్త పన్ను ఒక దరిద్రం అనుకుంటే వసూలు చేస్తున్న విధానం మరింత వింతగా ఉంది. రానున్న రోజుల్లో వైసిపి పాలకపక్షం ఓ కొత్త పథకం తీసుకు రాబోతుంది పన్ను కట్టకపోతే ఇల్లు జప్తు చేసి మున్సిపల్ వాహనాల్లో సామాన్లు పట్టుకుపోతున్నారన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేక వైసీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం లబ్ధిదారులను తగ్గిస్తున్నారు. భవిష్యత్లో నగరంలో మీ నాయకులు నిర్వహించే గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు కేశినేని శ్వేత.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?