Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వరుసగా భారీ హిట్స్ అందుకుంటున్న ఈ హీరో తర్వాత ప్రాజెక్ట్స్ కూడా తన రేంజ్‌కు తగ్గట్టుగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్’పై ఫోకస్ పెట్టిన షారుఖ్.. ఆ తర్వాత మాత్రం సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్లతో వరుసగా భారీ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే అట్లీతో మరోసారి చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తుండగా, సుకుమార్, ప్రశాంత్ నీల్ పేర్లు కూడా తెరపైకి వస్తుండటంతో ఇంతకీ షారుఖ్ ఖాన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటనే చర్చ అయితే జోరుగా సాగుతోంది.
2023లో ‘జవాన్’ సినిమాతో షారుఖ్ ఖాన్‌కు అట్లీ ఇచ్చిన సక్సెస్ ప్రత్యేకమైనది. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర భారీ ప్రభావం చూపడంతో వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తారనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అట్లీ కూడా గతంలో షారుఖ్‌తో మళ్లీ పనిచేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. అయితే అది ‘జవాన్ 2’ అవుతుందా లేదా పూర్తిగా కొత్త కథ అవుతుందా అనే విషయంలో మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్ హీరోగా ‘రాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత షారుఖ్‌తో చేతులు కలిపే అవకాశం ఉందనే ప్రచారం బాలీవుడ్, సౌత్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ ఇచ్చిన రిజల్ట్ ను దృష్టిలో పెట్టుకుంటే ఈ కాంబినేషన్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడే అవాకాశం ఉంది.
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో కూడా షారుఖ్ ఖాన్ సినిమా చేసే అవకాశం ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప’ ఫ్రాంచైజ్ తర్వాత తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నారు. షారుఖ్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో సుకుమార్ సినిమా అంటే ఏ స్థాయిలో ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో ఇప్పటికే మొదలైంది. అయితే ఈ కాంబినేషన్ కూడా ఇంకా ఫైనల్ కాలేదని చెప్పాలి.
మరోవైపు ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ పేరు కూడా షారుఖ్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లిస్ట్‌లో వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘డ్రాగన్’ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల కానుంది. ఆ తర్వాత షారుఖ్‌తో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘కింగ్’పైనే పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ సినిమా 2026 డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. ‘పఠాన్’, ‘జవాన్’ తర్వాత తన సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న షారుఖ్.. ఇకపై బాలీవుడ్‌తో పాటు సౌత్ దర్శకులతోనూ భారీ స్కేల్లో సినిమాలు చేయాలని చూస్తున్నట్లు ఈ వరుస రూమర్స్ చూస్తే అర్థమవుతోంది. అయితే వీటిలో ఏ ప్రాజెక్ట్ ముందుగా పట్టాలెక్కుతుందో తెలియాలంటే ఆఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
- Tags
- cinema
- Shah Rukh Khan
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!