Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ‘ఢీ 10’ విన్నర్ రాజు ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు. ఒక యువతిని లైంగికంగా వేధించాడనే తీవ్రమైన ఆరోపణలతో ఆయన కటకటాల పాలయ్యాడు. అయితే, ఈ కేసులో అందరినీ విస్మయానికి గురిచేస్తున్న అత్యంత సంచలన విషయం మరొకటి ఉంది. అదేమిటంటే.. ఒక సెలబ్రిటీపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించిన విషయాన్ని మియాపూర్ పోలీసులు ఇన్ని రోజుల పాటు అత్యంత గోప్యంగా ఉంచడం డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజు, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఒక యువతి మియాపూర్ పోలీసులను ఆశ్రయించింది. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
యువతి ఫిర్యాదుతో స్పందించిన మియాపూర్ పోలీసులు ఈ నెల 9న రాజుపై అధికారికంగా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు, తదుపరి చర్యల్లో భాగంగా అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి వెంటనే రిమాండ్‌కు తరలించారు. సాధారణంగా ఒక ప్రముఖ టీవీ షో విన్నర్, లేదా సెలబ్రిటీపై ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే ఆ వార్త క్షణాల్లో దావానలంలా వ్యాపిస్తుంది. పోలీసులు సైతం వివరాలను మీడియాకు వెల్లడిస్తారు. కానీ, రాజు కేసులో మాత్రం మియాపూర్ పోలీసుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 9వ తేదీనే కేసు నమోదు చేసి, అతన్ని రిమాండ్‌కు పంపినప్పటికీ.. ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా పోలీసులు చాలా జాగ్రత్త పడ్డారు. ఇన్ని రోజుల పాటు ఈ కేసు వివరాలను సీక్రెట్ గా ఉంచడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాజు జైలులో ఉండగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇటు బుల్లితెర వర్గాల్లోనూ, అటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసును పోలీసులు ఎందుకు దాచాల్సి వచ్చిందన్న దానిపై ఉన్నతాధికారులు స్పందిస్తే కానీ అసలు నిజాలు బయటకు రావు.
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!