NTV Telugu Site icon

Vangalapudi Anitha: టీడీపీ, వైసీపీ పార్టీల కార్యకర్తలు సంయమనం పాటించాలి..

Anitha

Anitha

Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసు అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కొన్ని అరాచక శక్తులు మా ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని ప్రజలకు అందరికీ తెలుసు.. గత ఐదేళ్లలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు అని ఆమె చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి నేతలకే ఇబ్బందులు ఎదురయ్యాయి.. ప్రజలిచ్చిన మద్దతును ఓర్చుకోలేక పోతున్నారు.. రెండు పార్టీల వ్యక్తులకు అప్పీల్ చేస్తున్నా.. అనవసరంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు.. చట్టం ఎవరికైనా ఒక్కటే టీడీపీ, వైసీపీ నేతలు, పార్టీల కార్యకర్తలు సంయమనం పాటించాలి అని ఏపీ హోంమంత్రి అనిత వేడుకున్నారు.

Read Also: UP: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన 12 కోచ్‌లు!

ఇక, మాజీ సీఎం వైఎస్ జగన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, కేంద్ర హోం మంత్రికి రాసే లేఖలో తన బాబాయ్ హత్య కేసు, డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసు సహా వివిధ ఘటనలను కూడా ప్రస్తావించాలి అని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు. గతం ప్రభుత్వ హాయంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది.. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది.. దేనికైనా సమయం వస్తుంది.. అన్ని అంశాలు చట్టపరంగా చర్యలు ఉంటాయి.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారంటేనే సగం శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్టే.. గతంలో దిశా యాప్ ను మగవాళ్ళతోను డౌన్ లోడ్ చేయించారు.. అత్యాచార ఘటనల నియంత్రణకు పోలీసు, విద్యా శాఖలతో స్పెషల్ డ్రైవ్ చేపడతామని ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత వెల్లడించారు.