Venkaiah Naidu: నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో గల స్వర్ణ భారత్ ట్రస్టు 23వ వార్షికోత్సవంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. గత 23 సంవత్సరాల క్రితం స్వర్ణ భారత ట్రస్ట్ను ప్రారంభించాం.. హైదరాబాద్, విజయవాడలో కూడా స్వర్ణ భారత్ సేవలు అందిస్తోంది అని చెప్పుకొచ్చారు. ఎందరో యువతకు స్వయం ఉపాధికి చేయూతనిస్తోంది.. ఇప్పటి వరకూ లక్ష మంది శిక్షణ తీసుకున్నారు.. గ్రామీణ సాధికారతే లక్ష్యంగా ఈ ట్రస్ట్ పని చేస్తోంది అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎలాంటి ఆర్థిక సహాయం తీసుకోవడం లేదు అని పేర్కొన్నారు. కానీ ప్రజల కోసం ప్రభుత్వంతో కలిసి స్వర్ణ భారత్ ట్రస్ట్ పని చేస్తోంది అని వెంకయ్య నాయుడు వెల్లడించారు.
Read Also: Doctors strike: డాక్టర్ల భద్రత కోసం కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం..
కాగా, స్వర్ణ భారత ట్రస్ట్ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ పని చేస్తోంది అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోంది.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, అధికారులు, ఎంతో మంది ప్రజా ప్రతినిధులు ఇక్కడికి వచ్చి విద్యార్థులకు ఆశీస్సులులు అందించారు అని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాల కోసం వెంకయ్య నాయుడు జీవితం అంకితం చేశారు.. గ్రామీణ భారతంలో సేవకు ఆయన అంకితమయ్యారని ప్రశంసలు కురిపించారు. అలాగే, స్వర్ణ భారత ట్రస్ట్ గ్రామీణ ప్రాంతాలకు చేస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు.