MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం నెలకొంది. కేసు ఛార్జిషీటులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరును చేర్చడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ పై ఈ కేసులో పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో మిథున్ రెడ్డి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పిల్ దాఖలు చేశారు. ఇవాళ ఆ పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్దివాల, జస్టిస్ మహదేవన్ ల ధర్మాసనం విచారణ చేపట్టింది. మిథున్ రెడ్డి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. మిథున్ న్ రెడ్డి దర్యాప్తుకు సహకరిస్తున్నాడు.. ఇప్పటికే ఒకసారి సిట్ ముందు హాజరయ్యాడు.. ఆయన ఎక్కడికి పారిపోలేదని కోర్టుకు తెలిపారు. వచ్చేవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.. త్వరలోనే సిటీ చార్జ్ సీటు వేసే అవకాశం ఉంది.
Read Also: KTR: కేసీఆర్ భోజనం పెడుతుంటే.. సీఎం రేవంత్ బిర్యానీ పెడతాడని గెలిపిస్తే మోసం చేశాడు
ఇక, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అరెస్టు చేయకుండా ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారు అని ప్రశ్నించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు తీర్పును వెల్లడించింది. మరోవైపు, మిథున్ రెడ్డి పిటిషన్ డిస్మిస్ అని ధర్మాసనం చెప్పాక.. కేసులో సరెండర్ కు కొంత సమయం ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి కోరారు. టేక్ యువర్ టైం అని సుప్రీంకోర్టు చెప్పింది.
