ఏపీని భారీవర్షాలు (Heavy Rains) వణికించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అనంతపురం, కడప జిల్లాలను వర్షాలు, వరదలు కుదిపేశాయి. ఏపీలో పలు జిల్లాల్లో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. అనంతపురం,పల్నాడు జిల్లాలో కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.. దీంతో కాలనీ వాసులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. బంగాళాఖాతంలో ఈ నెల 20వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని అది పెను తుఫాన్ గా మారనుంది అని మీడియాలో పలు రకాల కథనాలు వచ్చాయి. సిత్రాంగ్ (cyclone chitrang) అని తుఫానుకి పేరుపెట్టారు. దీని ప్రభావం ఏపీలోని తీరప్రాంత జిల్లాలపై ఉంటుందని వార్తలు షికార్లు చేశాయి. సూపర్ సైక్లోన్ ఏర్పడితే ఏపీ, ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలపైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Read Also: Andhra Pradesh: రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లో జమ కానున్న రూ.4వేలు
తెలంగాణపైనా ఈ తుఫాన్ ప్రభావం కనిపించనుందని వార్తలు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీవర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లడంతో అన్నదాతలు ఏం చేయాలో తెలీక అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ లోని పలు జిల్లాల ప్రజలు సిత్రాంగ్ పేరు చెబితే తీవ్ర ఆందోళనకు గురవు తున్నారు. అయితే ఈ సిత్రాంగు (chitrang) అనే తుఫాన్ పై షికారు చేస్తున్న వార్తలు పుకార్లు అని భారత వాతావరణ విభాగం IMD వివరణ ఇచ్చింది. భారతవాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.మహాపాత్ర సిత్రాంగ్ తుఫాను ప్రభావం పొంచి ఉందని వస్తున్న పుకార్లను నమ్మవద్దని అన్నారు. ఈ సూపర్ సైక్లోన్ కి చెందిన ఎలాంటి ప్రకటన IMD చేయలేదని ఆయన వెల్లడించారు. అయినా బంగాళాఖాతంలో ఏం జరుగుతుందో చెప్పలేం.
Read Also: AICC President Election: నేడే గాంధీభవన్ లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. బళ్లారిలో ఓటేయనున్న రాహుల్