రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ జ్యోతి, చైతన్య దీప్తి అల్లూరి సీతారామరాజు 98వ వర్థంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉమ్మడి రాష్ట్రాల క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని అల్లూరికి ఘన నివాళులర్పించారు. ఆనాటి స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినా పోరాటాన్ని…