Duvvada Srinivas: నా ప్రాణాలకు ముప్పు వస్తే ఆ ఇద్దరే కారణం.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన దువ్వాడ..
- శ్రీకాకుళం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన దువ్వాడ శ్రీనివాస్..
- జిల్లాలో జరుగుతున్న అన్యాయంపైన మాట్లాడుతున్నా..
- ఉద్యమాలు చేసి పోరాటం నుంచి వచ్చిన వాడిని..
- 2 + 2 గన్ మెన్‌ను ఇవ్వాలని కోరాను..
- నా ప్రాణాలకు ముప్పు వస్తే ధర్మాన కృష్ణదాస్, ప్రసాద్‌లే కారణం..
Duvvada Srinivas: నా ప్రాణాలకు ముప్పు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్.. నా ప్రాణాలకు ఏమైనా జరిగితే ఆ ఇద్దరే కారణం అంటూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ దువ్వాడ శ్రీనివాస్.. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శనివారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన దువ్వాడ, ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్, జిల్లాలో జరుగుతున్న అన్యాయాలపై తాను నిర్భయంగా మాట్లాడుతున్నానని, ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడినని అన్నారు. ప్రజల సమస్యల కోసం గొంతు ఎత్తడమే తన లక్ష్యమని తెలిపారు.
Read Also: Bus Accident : సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. 22 మందికి గాయాలు.!
Also Read
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
- Gunda Appala Suryanarayana Passes Away: కాలుజారి పడిపోయిన మాజీ మంత్రి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత..
జిల్లాలో కొందరు నాయకులు గ్రూపులుగా ఏర్పడి ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇచ్చాపురం, టెక్కలి, ఆముదాలవలస నియోజకవర్గాల్లో రాజకీయ గ్రూపులు కలిసి ప్రాంతంలో అశాంతి నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు దువ్వాడ.. తనపై బెదిరింపులు చేస్తున్నవారిలో సత్తారు సత్యం, తమన్నా కిరణ్, కోటబొమ్మాళి మండలం నుంచి మోహన్ ఉన్నారని దువ్వాడ తెలిపారు. గత కొద్ది రోజులుగా తనకు ఫోన్ ద్వారా, ప్రత్యక్షంగా బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదే కారణం అని.. అందుకే ముందస్తు భద్రతగా 2+2 గన్మెన్లను కేటాయించాలని ఎస్పీని కోరినట్లు వెల్లడించారు. చట్టంపై తనకు నమ్మకం ఉందని, ప్రజల కోసం చివరి వరకు పోరాడుతానని వ్యాఖ్యానించారు దువ్వాడ శ్రీనివాస్… అయితే, ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రజా సమస్యలపై మాట్లాడేవారిని అణచివేయాలనే ధోరణి సరైంది కాదని, ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరికీ అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుందని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!