CM Chandrababu: శ్రీకాకుళం జిల్లాలోని భామిని మండలంలో నిర్వహించిన విద్యార్ధులు, తల్లిదండ్రుల కలయకతో విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయి. మీమ్ములను చూసేసరికి ఎంతో ఎనర్జీ వచ్చింది అని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే, మన్యం జిల్లాలో లక్షా 43 వేలు తలసరి ఆదాయం ఉంది.. పాలకొండ, భామిని తలసరి ఆదాయం ఇంకా తక్కువగా ఉందన్నారు. జనసేన ఎమ్మెల్యేకు పూర్తిగా సహకరిస్తాం.. తోటపల్లి కాలువ, లిప్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వంశధార, నాగావళి అనుసంధానం చేస్తాం.. విజన్ 10 సూత్రాలు ఫాలోకండి అని సూచించారు.
Read Also: Pushpa 2: జపాన్‌లో ‘పుష్ప 2’.. అక్కడికే ఎందుకు?
అయితే, పేరెంట్స్ మీటింగ్‌లకు నేను ఏ రోజు వెళ్లలేదు.. లోకేష్ పుట్టినప్పటికి వారి తాత సీఎంగా ఉన్నారు.. అంతా నా భార్య చూసుకుంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పునాది బలంగా ఉంటే భవనం గట్టిగా ఉంటుంది.. అలాగే పిల్లలకు సబ్జెక్టులపై పట్టు వస్తుంది.. నా కొడుకును రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు.. మాకు బిజినెస్ ఉంది.. కానీ లోకేష్ స్వయంగా ఆలోచించి “విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తా” అని నిర్ణయించుకున్నారు. విద్యారంగంలో మార్పులు రావాలి.. ఏపీలో పిల్లలు నంబర్ వన్ స్థానంలో ఉండాలని లోకేష్ కోరిక.. అతను స్టాన్‌ఫోర్డ్‌లో చదివారు.. ఇక్కడ పిల్లలు కూడా అలాంటి స్థాయిలో చదవాలి.. లోకేష్ వారిని అలా ట్రైన్ చేయాలి అని పలువురు తల్లిదండ్రులు చెప్పారు.
Read Also: Virat Kohli 100 Centuries: 40 మ్యాచ్‌లు, 16 శతకాలు.. విరాట్ కోహ్లీ 100 ‘సెంచరీ’లు చేస్తాడా?
ఇక, ఏపీలో పిల్లలు కూడా స్టాన్‌ఫోర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల్లో చదివేలా చూడాల్సిన బాధ్యత లోకేష్‌దే అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 7వ తరగతి నుంచే గ్రూప్‌గా, వ్యక్తిగతంగా, ప్రాజెక్టు వర్కులు చేయాలి.. అదే మీ భవిష్యత్తును నిర్మిస్తుందని పేర్కొన్నారు. పిల్లలు చేసే ప్రాజెక్టులను పారిశ్రామిక వేత్తలకు చూపిస్తాను.. అలా చూపించి ఆ పిల్లలు భవిష్యత్తులో ఓ పారిశ్రామికవేత్తలుగా మారేలా చేస్తామన్నారు. విదేశీ విద్య కోసం ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా 25 పైసల వడ్డీతో రుణాలు అందిస్తాం.. ఇక, ఆడపిల్లల జోలికి వస్తే ఆ రోజు చివరి రోజే అని చంద్రబాబు హెచ్చరించారు.
