Cyclone Dana: దూసుకొస్తున్న ‘దానా’ తుఫాన్.. ఉద్దానంలో వణుకు..!
- తీరంవైపు దూసుకొస్తున్న దానా తుఫాన్..
- ఇచ్ఛాపురంపైనే అధిక ప్రభావాన్ని చూపుతుందని అంచనాలు..
- వణికిపోతోన్న ఉద్దానం.. తీర గ్రామాల ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Dana: తీరంవైపు దానా తుఫాన్ దూసుకొస్తుంది.. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. అధికార యంత్రాంగాన్ని, ప్రజలకు కీలక సూచనలు చేస్తోంది.. అయితే, దానా తుఫాన్ ఇచ్ఛాపురంపైనే అధిక ప్రభావాన్ని చూపుతుందనే అంచనాలతో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని ఉద్దానం, తీర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత, అనుభవాల దృష్ట్యా.. దానా ఏం చేస్తుందో అనే టెన్షన్లో పడిపోయారు..
Read Also: Trains Cancelled: దానా ఎఫెక్ట్.. మరో 17 రైళ్లు రద్దు .. సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు..
Also Read
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
- Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
అయితే, 1999లో అతి తీవ్ర తుఫాన్ ఒడిశాలో తీరం దాటినప్పుడు ఈ ప్రాంతంలో 12 లక్షల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి.. వేల ఎకరాల్లో జీడి తోటలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం దానా తుఫాన్ సైతం ఒడిశాలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.. తిత్లీ తుఫాన్ దెబ్బకు 16 లక్షల కొబ్బరి చెట్లు నాశనం కాగా.. 55 వేల ఎకరాల్లో జీడి తోటలు నామరూపాలు లేకుండా పోయాయి. ఇక, ప్రస్తుతం ఉద్దానం ప్రాంతంలో 40 వేల ఎకరాల్లో కొబ్బరి, 60 వేల ఎకరాల్లో జీడి తోటలు సాగు చేస్తున్నారు.. పదేళ్ల తర్వాత ఖరీఫ్‌లో వరి సాగు బాగుండటంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. కానీ, వారికి దానా భయం పట్టుకుంది.. తుఫాన్ ప్రభావం పడితే 80 వేల ఎకరాల్లో పంటకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. 2018 అక్టోబర్‌లో తిత్లీ తుఫాన్ సంభవించిందని.. అదే నెలలో దానా అతి తీవ్ర తుఫాన్ సంభవిస్తుందనే సమాచారంతో రెండు నియోజకవర్గాల్లోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏ క్షణాన ముప్పు వాటిల్లుతుందోనని మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ ఇళ్ల వద్ద కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు.. 2013లో ఫైలిన్ తుఫాను సృష్టించిన విధ్వంసం కూడా ఉద్దానం ప్రాంత ప్రజలను వెంటాడుతూనే ఉంది. వేలాది కొబ్బరి చెట్లు కోల్పోయిన పరిస్థితి అది.. మరి దానా తుఫాన్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తోందోనని వణికిపోతున్నారు రైతులు, ప్రజలు..
తాజావార్తలు
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!