Site icon NTV Telugu

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. తెలుగు జవాన్‌ వీరమరణం..

Murali Naik

Murali Naik

Operation Sindoor: భారత్-పాకిస్తాన్‌ యుద్ధంలో తెలుగు జవాన్‌ వీరమరణం పొందాడు.. జమ్మూ కాశ్మీర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు విడిచారు.. పాకిస్థాన్‌ జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు జవాన్‌ మురళీ నాయక్‌.. ఆయన స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండా.. రేపు కళ్లి తండాకు మురళీ నాయక్ పార్థివదేహాన్ని తరలించేందుకు భారత ఆర్మీ ఏర్పాట్లు చేసింది.. గోరంట్ల మండలం కళ్లితాండ గ్రామానికి చెందిన జ్యోతిబాయి, శ్రీరాముల నాయక్‌కు ఏకైక సంతానం మురళీ నాయక్‌.. సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్‌ విద్యా వ్యాసం చేసిన ఆయన.. 2022లో ఇండియన్‌ ఆర్మీలో చేరాడు.. నాసిక్‌లో ట్రైనింగ్ పొంది, జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్ కు ట్రాన్స్ఫర్ అయ్యాడు.. పంజాబ్‌లో పనిచేస్తుండగా.. భారత్-పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. రెండు రోజుల క్రితం పంజాబ్ నుండి జమ్మూకు విధుల నిమిత్తం వెళ్లాడు.. కానీ, పాక్‌ కాల్పుల్లో వీరమరణం పొందాడు.. ఇక, వీర జవాన్ మురళీ నాయక్‌ మరణవార్త విని గుండెలవిసేలా రోదిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు.. వీరజవాన్ మురళీ నాయక్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..

Read Also: Single : ‘సింగిల్’ మూవీ పై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్..

మురళీ నాయక్‌ మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. అంటూ ట్వీట్‌ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు, ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు మంత్రి నారా లోకేష్.. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన మురళి నాయక్ చూపిన ధైర్య, సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం.. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని ప్రకటించారు నారా లోకేష్..

Read Also: Operation Sindoor: మేడిన్‌ చైనా ఏదైనా అంతేనా..? పాక్‌ను నిండా ముంచిన డ్రాగన్..!

ఇక, జమ్ముకశ్మీర్‌లో తెలుగు జవాన్‌ మురళీ నాయక్‌ వీరమరణంపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. మురళీనాయక్‌ స్వస్ధలం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కళ్లి తండా.. దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్‌ త్యాగాన్ని మరువలేమన్న జగన్.. మురళీనాయక్‌ కుటంబీకులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.. పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు మురళీనాయక్‌ మృతికి సంతాపం ప్రకటించారు..

Exit mobile version