YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు పర్యటించనున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించడంతో పాటు అక్కడి మత్స్యకారులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనకు రాజకీయంగా, స్థానికంగా ప్రాధాన్యం ఏర్పడింది. మాజీ సీఎం జగన్ ఉదయం 8.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ ద్వారా జువ్వలదిన్నెకు చేరుకునేందుకు ప్రయాణం ప్రారంభించనున్నారు. ఉదయం 10.25 గంటలకు జువ్వలదిన్నె హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు వెళ్లి ఉదయం 10.25 గంటల నుంచి 10.55 గంటల వరకు హార్బర్‌ను సందర్శించనున్నారు.
Read Also: AP Inter Results 2026: ఇవాళే ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
Also Read
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
ఇక, మత్స్యకారుల సమస్యలు, హార్బర్ అభివృద్ధి, వసతులపై అక్కడే వైఎస్ జగన్ సమీక్షించే అవకాశం ఉందని సమాచారం. అనంతరం ఉదయం 11.05 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు మత్స్యకారులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలు, వేటకు సంబంధించిన ఇబ్బందులు, ప్రభుత్వ సహాయంపై చర్చించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12.25 గంటలకు జువ్వలదిన్నె నుంచి బెంగళూరుకు బయలుదేరనున్న వైఎస్ జగన్, మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగళూరులోని తన నివాసానికి చేరుకోనున్నారు. మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో జువ్వలదిన్నెలో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశముంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!