NTV Telugu Site icon

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసుల నోటీసులు..

Kakani

Kakani

Kakani Govardhan Reddy: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల షాక్ ఇచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా కాకాణి అందుబాటులో లేరు. అయితే, కాకాణి ఇంటికి తాళం వేసి ఉండటంతో.. ఆయనకు, ఆయన పీఏకు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ అని రావడంతో పోలీసులు ఏం చేయాలో తెలియక ఇంటి గేట్ కు నోటీసులను అంటించారు పోలీసులు.

Read Also: UP: విషాదం.. అలహాబాద్ ఐఐఐటీ హాస్టల్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

అయితే, వివరాల్లోకి వెళితే.. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్థాల వినియోగం, రవాణా ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను ఈరోజు (మార్చ్ 31) విచారణ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆదివారం అతడి నివాసానికి వెళ్లాగా.. విషయం ముందుగానే తెలుసుకున్న కాకాణి ఇంటికి తాళాలు వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Read Also: Balakrishna : ఆదిత్య369 కి సీక్వెల్ రెడీ.. ఆపేదే లే : బాలకృష్ణ

ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్ కేసులో విచారణ కోసం నోటీసులు ఇవ్వడానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి వచ్చాం.. కానీ, ఆయన, ఆయన పీఏ ఫోన్‌లకు కాల్‌ చేస్తే స్విచాఫ్‌ అని వస్తోంది.. అందుకే నోటీసులను గేట్ కి అంటించాం.. మార్చ్ 31వ తేదీన 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో కాకాణి విచారణకి హాజరు కావాల్సి ఉందని వెల్లడించారు.