Site icon NTV Telugu

Roop Kumar Yadav: మాజీ మంత్రి అనిల్‌కు రూప్‌ కుమార్‌ కౌంటర్‌..

Roop Kumar Yadav

Roop Kumar Yadav

Roop Kumar Yadav: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.. మాజీ మంత్రి అనిల్ కుమార్ ఒక ఎక్స్‌ట్రా ఆర్టిస్ట్‌ అంటూ ఎద్దేవా చేశారు.. మంత్రి నారాయణ మీద పెట్టినన్ని కేసులు, వేధింపులు ఎవరి మీద ఉండవన్న ఆయన.. అక్రమ అరెస్టులు, వేధింపులు తట్టుకొని 72 వేల ఓట్ల మెజార్టీతో నారాయణ గెలిచారని వెల్లడించారు.. అనిల్ కుమార్ లాగా భయపడి నియోజకవర్గం నుంచి వెళ్లిపోలేదు.. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రతి ఏటా పది కోట్లు సొంత నిధులు కేటాయించిన నాయకుడు నారాయణ అన్నారు..

Read Also: Sri Lanka vs New Zealand: రసవత్తర పోరులో విజయాన్ని అందుకున్న శ్రీలంక.. రెచ్చిపోయిన ప్రభాత్ జయసూరియ!

ఇక, వీపీఆర్ దంపతుల పేర్లు పలికే అర్హత కూడా అనిల్‌కు లేదని మండిపడ్డారు రూప్ కుమార్ యాదవ్ .. ఫతేఖాన్ పేటలో కూల్ డ్రింక్ షాపులో పనిచేసుకునే అనిల్.. ఎమ్మెల్యే ఎలా అయ్యాడు..? అని ప్రశ్నించారు.. నెల్లూరు జిల్లాను అనిల్ సర్వనాశనం చేసాడు.. అనిల్ ను ఎమ్మెల్యే, మంత్రి చేసింది మా లాంటి కార్యకర్తలే అన్నారు.. తన దగ్గర 17 ఏళ్లు మించి పనిచేస్తున్న వ్యక్తి నుంచి షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగానికి ఏడు లక్షలు తీసుకున్నాడు అని ఆరోపించారు.. టీడీపీలోకి వెళ్తున్న కార్పొరేటర్లను జనసేన పార్టీలోకి వెళ్లమని చెప్పాడు.. అసలు వైసీపీకి వెన్నుపోటు పొడిచింది అనిల్‌ కుమార్‌ యాదవే.. ఈ విషయం అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్..

Exit mobile version