Kakani Govardhan Reddy: కాకాణికి మళ్లీ షాక్‌.. మరో కేసులో రిమాండ్‌..

  • మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరోషాక్‌..
  • మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు..
  • పంటపాలెం మద్యం డంపు కేసులో నిందితుడిగా కాకాణి..
Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరోషాక్‌ తగిలింది.. ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్న కాకాణికి మరో కేసులో రిమాండ్ విధించింది కోర్టు.. గత ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలం పంటపాలెంలో దొరికిన మద్యం డంపు కేసులో ఆయన నిందితులుగా ఉండగా.. ఈ నేపథ్యంలో ఆయన్ని ఎక్సైజ్ పోలీసులు పీఈ వారెంట్ పై న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.. దీంతో, ఈ నెల 17వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు..

Read Also: IPS Officer Siddharth Kaushal Resigns: ఐపీఎస్ సిద్ధార్థ కౌశల్ వీఆర్ఎస్‌పై కొత్త చర్చ..

కాగా, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఈ మధ్యే బెయిల్ మంజూరు చేసింది నెల్లూరు నాల్గో అదనపు కోర్టు.. అయితే, ఈ కేసులో కాకాణికి బెయిల్‌ వచ్చినా.. ఇంకా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.. ఎందుకంటే.. మరో నాలు కేసుల్లో నిందితుడిగా ఉండగా.. ఇప్పుడు మరో కేసులో రిమాండ్‌ విధించింది కోర్టు..