Kakani Govardhan Reddy Fires On Chandrababu Naidu: కృష్ణపట్నం పోర్టుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాయి వేశారే తప్ప.. అంతకుమించి చేసిందేమీ లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తన హయాంలో రామాయపట్నం పోర్టును చంద్రబాబు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత అభివృద్ది కోసం సీఎం జగన్ రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభించారని చెప్పారు. నెల్లూరు జిల్లా అభివృద్ది జరిగింది అంటే.. అది దివంగత నేత వైఎస్సార్, సీఎం జగన్ హయాంలోనే అని పేర్కొన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు నిర్విరామంగా జరగుతున్నాయని అన్నారు.
Gudivada Amarnath: ఉన్నమాట అంటే ఉలుకెందుకు.. ఫ్లెక్సీ వివాదంపై మంత్రి అమర్నాథ్ రియాక్షన్
కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా పలు పరిశ్రమలను సీఎం జగన్ తీసుకొచ్చారని.. రామాయపట్నం పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ పరిపాలన అంటే బటన్ నొక్కుడేనా అని కొందరు అంటున్నారని.. అభివృద్ది గురించి మాట్లాడే వారికి, చేసిన పనులు చూసి మాట్లాడాలని హితవు పలుకుతున్నామని చురకలంటించారు. రామాయపట్నం పోర్టును సీఎం జగన్ చేతుల మీదుగా, అనుకున్న సమయానికే ప్రారంభిస్తామని తెలిపారు. ఇదే సమయంలో టీడీపీ మేనిఫెస్టోపై మంత్రి కాకాణి విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే టీడీపీ కాపీ కొట్టిందని ఆరోపించారు. తన మేనిఫెస్టోలో చంద్రబాబు పొందుపరిచిన హామీలన్నీ కాపీ కొట్టినవేనని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. గతంలోనూ రుణమాఫీ అమలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు.
Merugu Nagarjuna: చంద్రబాబు పార్టీ శవపేటికలా ఉంది.. మంత్రి నాగార్జున ధ్వజం
అంతకుముందు.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతాంగానికి ద్రోహం చేస్తే, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని మంత్రి కాకాణి ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతుగా గతంలో ఓట్లు వేయించిన పవన్.. చంద్రబాబు హయాంలో రైతులు పడ్డ ఇబ్బందులు కనిపించలేదా? అని అడిగారు. నాడు మొద్దు నిద్రలో ఉన్న పవన్.. ఇప్పుడు నిద్ర లేచి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్, చంద్రబాబులు పొలిటికల్ టూరిస్టులని.. ఓడిపోయిన తర్వాత హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు మాటలు, సినిమాలు చేసుకునే పవన్ మాటల్ని తాము పట్టించుకోమని తేల్చి చెప్పేశారు.