Kakani Govardhan Reddy: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనం అరుణమ్మ, రూరల్ ఇంచార్జి విజయ్ కుమార్ రెడ్డి.. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి.. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ పై సోషల్ మీడియాలో కొందరు టీడీపీ కార్యకర్తలు అనుచిత పోస్టులు పెడుతున్నారు.. వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే.. టీడీపీ నేతలు జగన్ పై అనుచిత పోస్ట్ లు పెట్టారు.. వాళ్ల వివరాలు సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాం అన్నారు.
Read Also: IPL 2025 Auction: ఆర్ అశ్విన్‌కు రూ.8.5 కోట్లు.. ఏ జట్టు తీసుకుందంటే?
ఇక, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు కాకాణి.. రాజ్యాంగం అందరికీ ఒక్కటే.. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నట్లే.. టీడీపీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు.. బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు చూడలేదు.. సోమిరెడ్డి వల్ల ఇబ్బంది పడ్డ దళితుని ఆవేదనను వాట్సప్ లో షేర్ చేస్తే.. నా మీద కేసులు పెట్టారు.. రేపు అనేది ఉందనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. టీడీపీ నేతలే ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి.. వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టారని.. అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.. అన్నింటినీ ధీటుగా ఎదుర్కొంటాం అని వ్యాఖ్యానించారు వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.